Sundeep Kishan’s Gully Rowdy Movie To Release On September 3rd

Sundeep Kishan’s Gully Rowdy Movie To Release On September 3rd (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

సెప్టెంబ‌ర్ 3న థియేట‌ర్స్‌లో ‘గ‌ల్లీరౌడీ’ న‌వ్వుల దాడి

కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం కాస్త స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత థియేట‌ర్స్‌కు సినీ ప్రేక్ష‌కాభిమానులు వ‌స్తున్నారు. అయితే కోవిడ్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మై థ్రిల్ల‌ర్స్‌, హార‌ర్‌, స‌స్పెన్స్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ను ఎక్కువ‌గా చూసిన ఆడియెన్స్ ఓ ప‌క్కా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటారన‌డంలో సందేహం లేదు. అలాంటి న‌వ్వుల విందు భోజ‌నాన్ని అందించ‌డానికి సెప్టెంబ‌ర్ 3న ‘గ‌ల్లీరౌడీ’ వ‌చ్చేస్తున్నాడు. నవ్వుల దాడికి సిద్ధమవండనే విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు.

ఇష్ట‌ప‌డ్డ అమ్మాయిని సొంతం చేసుకోవ‌డానికి తానొక పెద్ద రౌడీన‌ని బిల్డ‌ప్ ఇచ్చిన ఓ యువ‌కుడు.. దాని కోసం ఎలాంటి పాట్లు ప‌డ్డాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి కామెడీ క్రియేట్ అయ్యింద‌నే అంశంపై ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘గ‌ల్లీరౌడీ’ ప్రేక్ష‌కుల ముందుకు సెప్టెంబ‌ర్ 3న రాబోతున్నాడు.

న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
స‌హ నిర్మాత‌: జి.వి
సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌
క‌థ‌: భాను
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టైలిష్ట్‌: నీర‌జ కోన‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాక‌

Sundeep Kishan’s Gully Rowdy Movie To Release On September 3rd (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
More

This website uses cookies.