ప్రేమ గురించి చెప్పే ఒక గొప్ప కథ ‘పాగల్’ : హీరో విష్వక్ సేన్
విష్వక్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. సినిమా ఆగస్ట్ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో విష్వక్ సేన్ ఇంటర్వ్యూ విశేషాలు...
తొలి ఐదు, పది నిమిషాల్లోనే సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. నీ అంత బాగా నన్నెవరు చూసుకుంటారమ్మా అని హీరో తన తల్లిని అడిగినప్పుడు, తాను చనిపోతున్నానని కూడా తెలిసి ఆమె నాన్న నిజాయతీగా ప్రేమిస్తే వాళ్లు తిరిగి ప్రేమిస్తారు అని అంటుంది. అన్ కండీషనల్‌గా ప్రేమిస్తుంటే మా అమ్మ తిరిగి దొరుకుతుంది అని హీరోకి అనిపిస్తుంది. ఆ పాయింట్ మీదనే సినిమా అంతా రన్ అవుతుంది.
సినిమా ప్రేక్షకులను కచ్చితంగా కదిలిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు, సినిమాను గుండెల్లో పెట్టుకుంటారు. థియేటర్ నుంచి ఇంటికెళ్లిన తర్వాత సినిమా గురించి మాట్లాడకుండా ఉండలేరు. అంత ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఆడియో ఫంక్షన్‌లో నేను మాట్లాడిన ఏ మాటను వెనక్కి తీసుకోవడం లేదు. కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నాయి. నా స్నేహితులు, ఇతరులు సినిమా చూసి నువ్వు పేరేం మార్చుకోనక్కర్లేదన్నారు. సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావ్.. సినిమా తొలి ఆట పూర్తి కాగానే, ప్రమోషన్స్ ఆపేయొచ్చు అని నా స్నేహితుడొకడన్నాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చే ముందు నా సినిమాను నేను ఓసారి చూసుకుంటాను. దాన్ని బేస్ చేసుకునే స్టేజ్‌పై మాట్లాడుతాను. ఏడాది, ఏడాదిన్నర పాటు కష్టపడి సినిమా చేశాం. అందరం కథలో ఎమోషన్‌ను నమ్మి సినిమా చేశాం. ప్రథమార్థం వినోదాత్మకంగా ద్వితీయార్థం భావోద్వేగాలతో నడుస్తుంది.మాది పెద్ద సినిమా కాదు గొప్ప సినిమా. హృదయాలను కదిలిస్తుంది. సినిమా చూసిన వాళ్లు మాట్లాడకుండా ఉండలేరు.
చివరి అర్దగంట సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలను చూసిన నా ఫ్రెండ్స్ ఎవరూ నన్ను పొగడలేదు. కానీ ‘పాగల్’ సినిమా చూసిన తర్వాత పొగిడారు. సినిమాకు ఇప్పటి వరకు అందరూ తమకు తోచినంతగా సపోర్ట్ చేశారు. ఇకపై సినిమా చూసే విమర్శకులు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నాపై కావాలనే ఎటాక్ చేయవద్దు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను.
పివిపిగారు, దిల్‌రాజుగారు కలిసి చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. ఇప్పటికే అది డెబ్బై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇది కూడా లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దీని తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్నాను. దీనికి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారు, బాపినీడుగారు నిర్మాతలు.