Social News XYZ     

Srinivas Avasarala’s 101 Jillala Andagadu Grand Release In Theaters On August 27th

ఆగ‌స్ట్ 27న అవ‌స‌రాల శ్రీనివాస్ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘101 జిల్లాల అంద‌గాడు’

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న అవ‌స‌రాల శ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘101 జిల్లాల అంద‌గాడు’. బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ చిత్రంలో ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు.

శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమో, టీజ‌ర్‌, టైటిల్ సాంగ్‌తో పాటు ‘మనసా వినవా..’ లిరిక‌ల్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క్రియేట్ అయ్యింది. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ 101 జిల్లాల‌ అంద‌గాడు చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ, శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

 

న‌టీన‌టులు:
అవ‌స‌రాల శ్రీనివాస్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌
నిర్మాత‌లు: శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
ర‌చ‌యిత‌: అవ‌స‌రాల శ్రీనివాస్‌
సినిమాటోగ్ర‌ఫీ: రామ్‌
ఎడిట‌ర్‌: కిర‌ణ్ గంటి
సంగీతం: శ‌క్తికాంత్ కార్తీక్‌
ఆర్ట్‌: ఎ.రామాంజ‌నేయులు
డిజైన‌ర్‌: ఐశ్వ‌ర్యా రాజీవ్

Facebook Comments
Srinivas Avasarala's 101 Jillala Andagadu Grand Release In Theaters On August 27th

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.