Vivaha Bhojanambu movie trailer released

Vivaha Bhojanambu movie trailer released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

"వివాహ భోజనంబు" సినిమా ట్రైలర్ విడుదల, 'సోని లివ్' లో త్వరలో మూవీ స్ట్రీమింగ్

కమెడియన్ సత్య హీరోగా నటించిన "వివాహ భోజనంబు" సినిమా ట్రైలర్ రిలీజైంది. ఆద్యంతం నవ్విస్తూ సాగిన ఈ ట్రైలర్ 'సోని లివ్' ఓటీటీ 5 గంటలకు విడుదల చేసింది. త్వరలో 'సోని లివ్' ఓటీటీ ద్వారా "వివాహ భోజనంబు" సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాను సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో "వివాహ భోజనంబు" చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. నూతన తార అర్జావీ రాజ్ నాయికగా నటించింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా చూపించనుందీ సినిమా.

"వివాహ భోజనంబు" మూవీ ట్రైలర్ చూస్తే...తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్ డౌన్ పిడుగుపాటులా మీద పడుతుంది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన కథానాయకుడు వాళ్లకు పెట్టే ఖర్చులు తట్టుకోలేకపోతాడు. క్రికెట్ టీమ్ లా ఇంట్లో ఉండిపోయిన ఈ బంధువులను వదిలించుకోలేక అతను పడే పాట్లు నవ్వించాయి. ట్రైలర్ లోనే ఇన్ని నవ్వులు ఉంటే, సినిమాలో ఇక బోలెడన్ని నవ్వులు ఖాయమని తెలుస్తోంది.

తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంఛ్ అవుతున్న 'సోని లివ్' ..తన తొలి చిత్రంగా "వివాహ భోజనంబు" ను స్ట్రీమింగ్ చేయబోతోంది. స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. "వివాహ భోజనంబు" వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీని తన తొలి చిత్రంగా ఎంచుకోవడం 'సోని లివ్' తీసుకున్న బెస్ట్ డెసిషన్ గా భావించవచ్చు. థియేటర్ లలో అడుగు పెట్టేందుకు ఇంకా భయపడుతున్న కుటుంబ ప్రేక్షకులకు 'సోని లివ్' ఫస్ట్ వరల్డ్ ప్రీమియర్ మూవీ "వివాహ భోజనంబు" కావాల్సినంత వినోదాన్ని పంచనుంది.

సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి, నిత్య శ్రీ, కిరీటి, దయ, కల్ప లత తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - అనివీ, సినిమాటోగ్రఫీ - మణికందన్, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - సతీష్, విజయ్, కథ - భాను భోగవరపు, మాటలు - నందు ఆర్ కె, సాహిత్యం - కిట్టు, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సీతారాం, శివ చెర్రి, నిర్మాతలు - కేఎస్ శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం - రామ్ అబ్బరాజు.

Vivaha Bhojanambu movie trailer released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share
More

This website uses cookies.