"ఏవమ్ జగత్" మూవీ ఫస్ట్ లుక్ విడుదల
ప్రపంచీకరణ నేపధ్యంలో ఎన్నో కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఎంతో మంది తమ సొంత ఊర్లు విడిచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీని వల్ల నిజంగా మన దేశం అభివృద్ధి చెందిందా..? మన కలాం గారి కల, మిషన్ 2020 నెరవేరిందా..? ఇలాంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న సినిమా "ఏవమ్ జగత్". ఈ చిత్రాన్ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు. దినేష్ నర్రా దర్శకుడు.
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "ఏవమ్ జగత్" సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ...వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా 'ఏవం జగత్' మూవీలో చూపిస్తున్నాం. వ్యవసాయం మరియు మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక 20 ఏళ్ల యువకుడి ( కమల్ ) కథే 'ఏవం జగత్'. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో కమల్ ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. చివరికి తెలుసుకున్నది ఏంటి అనేది తప్పక చూడాలి. 'ఏవం జగత్' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే మూవీని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
నటీనటులు - కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు
సాంకేతిక బృందం - సంగీతం - శివ కుమార్, సినిమాటోగ్రఫీ - వెంకీ అల్ల, ఎడిటింగ్ - నిశాంత్ చిటుమోతు, ఆర్ట్ - సదా వంశి, ప్రొడక్షన్ మేనేజర్ - అభినవ్ అవునూరి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ - మోహన్ కృష్ణ, సంపూర్ణమ్మ, స్కంద ఆముదాల, నిర్మాతలు - ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్, రచన దర్శకత్వం - దినేష్ నర్రా
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.