Social News XYZ     

Washington Telugu Samithi To Conduct International Telugu Poetry Competition

వాషింటన్ తెలుగు సమితి: అంతర్జాతీయ తెలుగు కవితల పోటీ

వాషింటన్ తెలుగు సమితి అంతర్జాతీయ తెలుగు కవితల పోటీకి శ్రీకారం చుట్టింది.  "పడమటిసంధ్యారాగం" పేరిట "అమెరికాతో భారతీయుల అనుబంధం" అనే అంశంతో వచన కవితలను ఆహ్వానిస్తోంది.

భారతదేశం మాతృభూమిగా గల ఎందరో భారతీయులు అమెరికాని తమ పితృభూమిగా భావిస్తారు. అమెరికాకి వలస వెళతారు. జీవనం కొనసాగిస్తారు. అక్కడి పౌరులుగా స్థిరపడతారు. ఆ దేశాన్ని మాతృభూమిగా తమ పిల్లలకందిస్తారు. రెండు దేశాలు ఎల్లప్పుడూ శాంతిగా ఉండాలిని కోరుకుంటారు. రెండు సంస్కృతులమధ్య వారధి కడతారు.

 

ఈ నేపథ్యంలో తెలుగువారి మనసులో అమెరికా స్థానం ఏమిటి అన్న విషయంపై వచన కవితలను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలజేసింది వాషింగ్టన్ తెలుగు సమితి.

పాల్గొనే వారికి నియమాలు, సూచనలు, కవితలు పంపవలసిన చిరునామా మొదలైనవి ప్రకటనలో పొందుపరించారు. ఈ కవితా మహోత్సవానికి అధ్యక్షత శ్రీ షకీల్ బాషా, నిర్వహణ శ్రీ జయపాల్ రెడ్డి దొడ్డ, సంచాలకత్వం శ్రీ మధు రెడ్డి మరియు పర్యవేక్షణ శ్రీ శ్రీనివాస్ అబ్బూరి, ఉపాధ్యక్షులు

న్యాయనిర్ణేతల నివేదిక అనంతరం సుప్రసిద్ధ సినీకవుల సమక్షంలో తొలి పది స్థానాల్లో నిలిచిన కవయిత్రీ కవులచే కవితా సమ్మేళనం మరియు బహుమతుల ప్రకటన ఉండబోతోంది.

Facebook Comments
Washington Telugu Samithi To Conduct International Telugu Poetry Competition

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: