ఐదు భాషల్లో విడుదల చేస్తున్న "ఇక్షు" ప్రోమోకు మంచి స్పందన వచ్చింది.
పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు అండ్ డాక్టర్ గౌతమ్ నాయుడు ప్రెసెంట్స్ లో వస్తున్న సినిమాను ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.మేము విడుదల చేసిన "ఇక్షు" ప్రోమోకు సినీ పెద్దలనుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్న సందర్భంగా...
చిత్ర నిర్మాతలు హనుమంత నాయుడు మాట్లాడుతూ... గతంలో మేము యన్ టి.ఆర్ గారి జయంతి రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఎన్టీఆర్ డైలాగ్ ను ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే మేము ఐదు భాషల్లో విడుదల చేసిన ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది చాలా చోట్ల నుండి ఫోన్స్ వస్తున్నాయి. కొంతమంది సినీ పెద్దలకు మా సినిమా ప్రోమోను చూయించడం జరిగింది. ఫస్ట్ టైం మా బ్యానర్ లో వస్తున్న సినిమా ప్రోమో చూసిన పెద్దలందరూ కూడా ప్రోమో బాగుందని ప్రశంసించారు. ఫస్ట్ టైం హీరోగా రామ్ అగ్నివేశ్ ఇండస్ట్రీ కి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో ఒక సన్నివేశం ఎన్టీఆర్ గారి ఫేమస్ అయిన డైలాగ్ వుంది. ఆ డైలాగ్ ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం, ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి లాంటి గెటప్ వేసుకొని డైలాగ్ చెప్పటం గొప్ప విషయం, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా ఎన్టీఆర్ గారి డైలాగ్ వెర్షన్ పోస్టర్ నేను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా వుంది .రాజీవ్ కనకాల గారు మేము అడిగిన వెంటనే ఒప్పుకొని మాకు ఎంతో సహకరించారు.మిగిలిన నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. స్టోరీ స్క్రీన్ప్, డైరెక్షన్ చేసిన ఋషిక అనుకున్న దానికంటే సినిమాను చాలా చక్కగా తీశారు . పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీస్ లో నిర్మించిన "ఇక్షు" సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇదే బ్యానర్ లో మరిన్ని సినిమాలు నిర్మించ బోతున్నాము.సినిమాల మీద మక్కువతో మేము తీస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ "ఇక్షు" సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అన్నారు..
దర్శకురాలు ఋషిక మాట్లాడుతూ.. లేడీ డైరెక్టర్ అని చూడకుండా చాలా మంది హెల్ప్ చేశారు. హీరో రామ్ అగ్నివేశ్ ని చాలా చక్కగా నటించాడు. మా సినిమా లో కొన్ని సన్నివేశాలు చూసిన ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.నాకీ అవకాశమిచ్చి నిర్మాతలకు ధన్యవాదాలు..
నటీనటులు :
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు
సాంకేతిక. నిపుణులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల,
మూల కథ: సిద్ధం మనోహర్
కెమెరా: నవీన్ తొడిగి
పాటలు:-కాసర్ల శ్యామ్
మ్యూజిక్: వికాస్ బాడిస
ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్
ఆర్ట్స్: రాజు
మాటలు: మున్నా ప్రవీణ్
కొరియోగ్రఫీ: భాను
పి.ఆర్.ఓ: మధు వి ఆర్
This website uses cookies.