సెన్సేషనల్ 'సారంగ దరియా', సౌతిండియాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్ గా కొత్త రికార్డ్
"లవ్ స్టోరి" చిత్రంలోని 'సారంగ దరియా' పాట యూట్యూబ్ వ్యూస్ లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్ లో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. 'రౌడీ బేబీ', 'బుట్ట బొమ్మ' వంటి సంచలన పాటలు కూడా లిరికల్ సాంగ్ వ్యూస్ లో 'సారంగ దరియా' వెనకబడ్డాయి. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానెల్ లో అప్ లోడ్ అయిన 'సారంగ దరియా' పాట తొలి రోజు నుంచే శ్రోతలను ఆకట్టుకుని, రోజూ మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటూ వచ్చింది. 'సారంగ దరియా'కు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, ఉత్సాహంగా మంగ్లీ పాడిన తీరు సామాన్యుడి నుంచి విశిష్ట వ్యక్తుల దాకా అందరికీ నచ్చింది. ఇక ఈ పాటలో శేఖర్ మాస్టర్ స్టెప్పులను నాయిక సాయి పల్లవి తనదైన స్టైల్ లో మెరుపుతీగలా చేసింది. సాయి పల్లవి టైమింగ్, ఎనర్జీ, ఎక్స్ ప్రెషన్స్, ఇన్ వాల్వ్ మెంట్ 'సారంగ దరియా' పాటకు ప్రధాన ఆకర్షణ అయ్యాయి.
"లవ్ స్టోరి" చిత్రంలో 'సారంగ దరియా' పాటను తీసుకోవాలి అని దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన ఆలోచన వందశాతం విజయవంతం అయ్యింది. ఈ సినిమాకు 'సారంగ దరియా' డ్రైవింగ్ ఫోర్స్ అయ్యిందని చెప్పొచ్చు. రేవంత్, మౌనిక లవ్ స్టోరిని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.