Kannada Superstar Kiccha Sudeep K3 Kotikokkadu Movie First Look Poster Is Impressive

ఆకట్టుకుంటోన్న కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ K3 కోటికొక్కడు ఫస్ట్ లుక్ పోస్టర్.

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, మడోన్నా సెబీస్టియన్ హీరోహీరోయిన్లుగా నటంచిన చిత్రం కోటిగొబ్బ 3. శ్రద్దా దాస్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కన్నడలో అత్యధిక బడ్జెట్ లో MB బాబు నిర్మించారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించగా, అర్జున్ జన్య సంగీతం అందించారు. ఇప్పటికే కన్నడలో రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అవడంతో సినిమాపై భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి.

హై ఎక్సపెక్టషన్స్ ఉన్న కోటిగోబ్బ 3 చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ మరియు ఓవర్సీస్ (FMS) రైట్స్ ని శ్రేయస్ మీడియా అనుసంధానిత సంస్థ గుడ్ సినిమా గ్రూప్ ఫ్యాన్సీ అమౌంట్ చెల్లించి రైట్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో K3 కోటికొక్కడు అనే టైటిల్ తో, స్పందన పాసం, శ్వేతన్ రెడ్డి సమర్పణలో దేవేందర్ DK మరియు గుడ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ రోజు K3 కోటికొక్కడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు మారుతి, బాబీ, గోపీచంద్ మలినేని సంయుక్తంగా లాంచ్ చేశారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ సిగరెట్ వెలిగిస్తూ డాలర్స్ మధ్య నుండి నడుస్తూ ఉన్న ఈ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఏప్రిల్ 4వ వారంలో ఈ చిత్రాన్ని కన్నడ మరియు తెలుగు భాషల్లో ఏకకాలం లో అత్యధిక థియేటర్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కిచ్చా సుదీప్, మడోన్నా సెబీస్టియన్, శ్రద్దా దాస్ నటిస్తోన్న చిత్రానికి..
బేనర్: గుడ్ సినిమా గ్రూప్,
నిర్మాత: గుడ్ ఫ్రెండ్స్, దేవేంద్ర డీకే
సమర్పణ: స్పందన పాసం, శ్వేతన్ రెడ్డి,
దర్శకత్వం: శివ కార్తీక్,
సంగీతం: అర్జున్ జన్య,
సినిమాటోగ్రఫీ: శేఖర్ చంద్రు,
పీఆర్ఓ: వంశీ- శేఖర్.

Kannada Superstar Kiccha Sudeep K3 Kotikokkadu Movie First Look Poster Is Impressive (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%