లాంఛనంగా జరిగిన `విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్` కర్టన్ రైజర్ కార్యక్రమం.
పద్మాలయ సంస్థ 52 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పాటు, విజయకృష్ణ మూవీస్ స్థాపించి 50 వసంతాలు అవుతున్న సందర్భంగా ఇరు సంస్థలకు మూల స్థంభం అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణగారికి మరియు పద్మాలయ రధసారథి జి. ఆదిశేషగిరిరావు గారికి...అదేవిధంగా విజయకృష్ణ మూవీస్ నిర్మాతలు( కీ.శే. శ్రీమతి విజయనిర్మలగారి సోదరులు) ఎస్ రవి కుమార్, రమానంధ్ గారిని మరియు ఇతర పెద్దలను డా. వి.కె నరేష్, అతని తనయుడు నరేష్ విజయ్ కృష్ణ సత్కరించారు. అటు పద్మాలయ సంస్థ తెలుగుతో పాటు హిందీ తమిళ బాషల్లో భారీ చిత్రాలు నిర్మించడంతో పాటు హైదరాబాద్‌లో పద్మాలయ స్టూడియోస్ స్థాపించి సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడంలో కీలక పోషించిన విషయం తెలిసిందే..
విజయ కృష్ణ మూవీస్ సూపర్‌హిట్ చిత్రం మీనాతో ప్రారంభించి, హేమాహేమీలు, అంతం కాదు ఇది ఆరంభం లాంటి చిత్రాలు కృష్ణగారితో నిర్మించడంతో పాటు నరేష్‌తో ప్రేమ సంకెళ్లు, ముక్కోపి లాంటి హిట్ చిత్రాలు నిర్మించి డా. విజయనిర్మల గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లభించడానికి దోహదపడింది. గతంలో 1976నుండి డబ్బింగ్ రికార్డింగ్ స్టూడియోలు, ఎడిటింగ్ రూమ్స్ మరియు సినీ పరిశ్రమకు కావాల్పినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ విజయకృష్ణ మూవీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్థ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రెండోతరం అయినటువంటి డా. నరేష్, మూడోతరం నవీన్ విజయ కృష్ణ ఆ సంస్థని విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్
పేరుతో పునర్నిర్మాణం చేయడానికి, సినీ పరిశ్రమకు కావాల్సిన సదుపాయాలు, మరియు హార్డ్ వేర్, సాఫ్ట్‌వేర్ తయారు చేయడానికి రంగం సిద్దం చేశారు. ఈ క్రమంలో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని సినీ పరిశ్రమకు సంభందించినటువంటి బందు మిత్రులతో, పెద్దలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, ఆనంద్ దేవరకొండ, సుధీర్ బాబు, వెంకటేష్ మహా, శ్రీరామ్ ఆదిత్య, వి ఐ ఆనంద్, శరత్ మరార్, మద్దాల రవి తదితరులుics పాల్గొన్నారు.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.