Social News XYZ     

Devineni Movie Praised By Vijaywada Leaders

బెజవాడ నాయకుల మెప్పు పొందిన "దేవినేని"

నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం) అనేది ట్యాగ్ లైన్. ఏపీ హైకోర్టు విజయవాడ నాయకులకు 'దేవినేని' సినిమా చూపించమని తెలపడంతో ఈ చిత్ర్రాన్ని గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో బెజవాడ నాయకులతో పాత్రికేయులకుకు ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందీ. చిత్ర ప్రదర్శమ అనంతరం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా

చిత్ర దర్శకుడు నర్రా శివనాగు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా గొడవలు జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.. కొంతమంది నాయకులు దర్శకుడు నర్రా శివనాగు "దేవినేని" టైటిల్ తో బెజవాడను కించపరచడానికి తీశాడని, ఈ సినిమా విడుదల అయితే ప్రశాంతంగా ఉన్న బెజవాడ కత్తుల వాడగా మారుతుందని డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లును సినిమా విడుదల చేయకూడదని హెచ్చరిచారు. అలాగే మా సినిమా పై కేసు వేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే.దానికి హైకోర్టు మాకు నోటీసులు పంపడం జరిగింది. దాంతో మేము కొంతమంది నాయకులతో మాట్లాడడం జరిగింది.ఆ తరువాత ఏపీ హైకోర్టు "దేవినేని" సినిమాను బెజవాడ నాయకులకు ఈ సినిమా చూపించమని తెలపడం జరిగింది .కోర్టు చెప్పిన మేరకు ఈ సినిమాను బెజవాడ నాయకులకు చూపించడం జరిగింది సినిమా చూసిన తర్వాత వారు ఇందులో ఎలాంటి రెచ్చగొట్టే అంశాలు లేవని, విజయవాడలో రౌడీయిజం లేదని గొప్పగా చూపించారని.ఈ సినిమా చాలా బాగుంది అని వారు ప్రశంసించారు. వారికి నా ధన్యవాదాలు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ భయపడకుండా ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేలా బెజవాడ నాయకులు సహాయం చెయ్యాలని మనవి చేసుకొనుచున్నాను. ఈ వారంలో విడుదలవుతున్న 14 సినిమాలలో మా సినిమా అత్యధికంగా 250 థియేటర్ విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది .మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన ఈ సినిమా తెలుగు ప్రజలందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.

 

చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .విజయవాడ లో ఎలాంటి గొడవలు లేవని చిత్రం ద్వారా తెలియజేస్తూ..వంగ వీటి,దేవినేని ల మధ్య స్నేహం, బాంధవ్యాన్ని సినిమాటిక్ గా శివనాగు తెరకెక్కించడం జరిగింది.సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని అన్నారు

నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ .. దేవినేని గారి ఆశీస్సుల వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది విజయవాడ నుండి వచ్చిన వారు ఈ సినిమా చూసి బాగుందని చెప్పడంతో నాకు ఎంతో సంతోషం అనిపించింది వారి మాటలతో మా సినిమాకు మరిన్ని థియేటర్ పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నాను..మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కుటుంబం సమేతంగా చూడదగ్గ చిత్రం. ప్రేక్షకూలందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని అసిస్తున్నానని అన్నారు.

చందు రమేష్ మాట్లాడుతూ.. రాజకీయానికి రాజధాని విజయవాడ ఆ విజయవాడనీ కథగా తీసుకొని సినిమా తీశాడు శివనాగు.ఏ వ్యక్తికి అనుకూలంగా తీయకుండా సినిమాను ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చూపించాడు సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపారు

లంకపల్లి నివాస్ మాట్లాడుతూ .. అన్ని వర్గాల వారిని నచ్చే విధంగా ఉన్న దేవినేని పెద్ద విజయం సాధించాలని అన్నారు.

ఆర్టిస్ట్ మురళి మాట్లాడుతూ ...ఇందులో నేను దేవినేని మురళి గా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసిన తరువాత నేను చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

నటీనటులు
నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార,
బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి,తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు

సాంకేతిక నిపుణులు
ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్
నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్
డైరెక్టర్ :-నర్రా శివనాగు
లిరిక్ రైటర్ :- మల్లిక్,
పి ఆర్ ఓ.:- మధు వి.ఆర్

Facebook Comments
Devineni Movie Praised By Vijaywada Leaders

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.