"లవ్ స్టోరి" చిత్రంలోని 'సారంగధరియా' పాటను విడుదల చేయనున్న స్టార్ హీరోయిన్ సమంత
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రేవంత్, మౌనికల ఈ ప్రేమ కథలో పాటలకు చాలా ప్రాధాన్యత ఉండనుంది. అందుకు తగినట్లే పవన్ సీహెచ్ ఎప్పటికీ గుర్తుండిపోయే స్వరాలు అందించారు.
శేఖర్ కమ్ముల చిత్రంలో పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతుంటాయి. "లవ్ స్టోరి" చిత్రంలోనూ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయి హయ్యెస్ట్ వ్యూస్ సాధిస్తున్నాయి. తొలి పాటగా రిలీజ్ చేసిన 'హే పిల్లా..' దాదాపు 15 మిలియన్ల వ్యూస్ సాధించాయి. ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ చేసిన రెండో పాట 'నీ చిత్రం చూసి' కు ఇప్పటికే 3 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. తాజాగా "లవ్ స్టోరి" చిత్రంలో మూడో పాట సారంగధరియా ను స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 28న ఉదయం 10.08 నిమిషాలకు సమంత సారంగధరియా పాటలు విడుదల చేస్తున్నారు. ఈ పాట లవ్ స్టోరీ చిత్రానికే హైలైట్ గా ఉండబోతోంది. సాయి పల్లవి ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేయనుంది.
ఏప్రిల్ 16న "లవ్ స్టోరి" సినిమా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
This website uses cookies.