డా॥ రాజేంద్ర ప్రసాద్ విడుదల చేసిన పద్మశ్రీ పొస్టర్స్.
ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై, PVS రామ్మోహన్ మూవీస్, తృప్తి రిసార్ట్స్ సహకార సారథ్యంలో ఎస్.ఎస్. పట్నాయక్ రచన,దర్శకత్వంలో సదాశివుని శిరీష నిర్మాతగా, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ మరియు PVS రామ్మోహన్ రావు సహనిర్మాతలు గా నిర్మితమైన " పద్మశ్రీ " సినిమా హీరోస్ లుక్, & హీరోయిన్స్ లుక్ పోస్టర్లని ఇటీవల కళాప్రపూర్ణ, నటకిరీటి, డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదగా ఆవిష్కరణ జరిగినది.
డాట్ యానిమేషన్ వారు అందించిన గ్రాఫిక్స్ తో పాటు కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హర్రర్ మూవీగా రూపుదిద్దుకున్న పద్మశ్రీ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ... తను రచయితగా దర్శకుడిగా చేసిన ఈ చిత్రంలో నలుగురు హీరోల్లో తాను ఒక ముఖ్య పాత్ర లో కనబడుతున్న హీరోస్ ఫస్ట్ లుక్ని తన చిన్ననాటి నుండి ఎంతగానో అభిమానిస్తున్న తన అభిమాన హీరో, రోల్ మోడల్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతులమీదుగా ఆవిష్కరణ జరగటం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో తాను సంపాదించుకున్న ఒక గ్రేట్ ఎచీవ్మెంట్ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ చిత్ర విశేషాలు తెలుసుకున్న సీనియర్ హీరో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ తనను రోల్ మోడల్ గా చేసుకున్న తన అభిమానులు ఇలా నటుడిగా, దర్శకుడిగా మారటం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని అయితే గౌరవప్రథమైన పేరు పెట్టి గౌరవప్రదంగా తీసిన ఈ పద్మశ్రీ సినిమా... పెద్ద హిట్ అవ్వాలని అలా జరిగితే తనకు ఇంకా ఎంతో గౌరవంగా ఉంటుందని కొనియాడుతూ పద్మశ్రీ చిత్ర యూనిట్ సభ్యులందరికీ తన అభినందనలు ఆశీస్సులు అందించారు!
పోస్టర్స్ పబ్లిసిటీ క్లియరెన్స్ చేసుకొని, సెన్సార్ దశలో ఉన్న ఈ చిత్రానికి
నటీనటులు :
పక్కి కిషోర్, ఎస్ ఎస్ పట్నాయక్, అల్లెన్ హర్ష, చక్రవర్తి హీరోలుగా హీరోస్ లుక్లో కనిపించగా....
కనికా ఖన్నా, రావులపల్లి సంధ్యారాణి, రమ్య, మాధురి హీరోయిన్లుగా హీరోయిన్స్ లుక్ పోస్టర్స్ లో కనిపించారు.
గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ లో కనిపించిన జ్యోతి తో పాటు సతీష్ మరుపల్లి, డాక్టర్ ప్రవీణ్, కాళీ చరణ్, ఫన్నీ రాజు, పూజారి లక్ష్మణరావు, ఏ.వి.రమణ మూర్తి, కరుణాకర్, పూడి తిరుపతిరావు, జయశ్రీ ఇతర ముఖ్య పాత్ర దారులుగా నటించిన ఈ చిత్రానికి
ఇతర సాంకేతిక వర్గం :
ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, ఎడిటింగ్: కంబాల శ్రీనివాసరావు, విజువల్ ఎఫెక్ట్స్: విక్రం విలాసాగర్, ఆర్ట్: మణిపాత్రుని నాగేశ్వరరావు, ఫైట్స్: దేవరాజు మాస్టర్, సంగీతం: జాన్ పోట్ల, డాన్స్: వెంకట్, తారక్, లిరిక్స్: బాసంగి సురేష్ కుమార్, డబ్బీరు గోవిందరావు, మెండెం శ్రీధర్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్: పక్కి సురేష్, హారిక కృష్ణ!
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.