Social News XYZ     

Rani Movie Receives Critical Acclaim – Producers Kishore Marishetti And Nazia Sheikh

రాణి" చిత్రం విమర్శకుల ప్రశంశలు అందుకుంటుంది.. చిత్ర నిర్మాతలు కిషోర్ మారిశెట్టి మరియు నజియా షేక్

"రాణి" చిత్రం పై మేము పెట్టుకున్న ఆశలను ప్రేక్షకులు నిజం చేశారని ఆ చిత్ర బృందం వెల్లడించింది.శ్వేతా వర్మ,ప్రవీణ్,కిషోర్ మరి శెట్టి ,అప్పాజి అంబరీష్ నటీ,నటులుగా మనోహరి ఆర్ట్స్ & నజియా షేక్ ప్రొడక్షన్స్ పతాకంపై రాఘవేంద్ర దర్శకత్వంలో కిషోర్ మారిశెట్టి మరియు నజియా షేక్ లు నిర్మించిన ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం “రాణి” అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫాం లలో తెలుగు,హిందీ బాషల్లో విడదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖులను ఆహ్వానించి "రాణి" మూవీ ప్రివ్యూ వేయడం జరిగింది. సినిమా చూసిన పలువురు పెద్దలు ఇప్పటి వరకు ఎవరూ తీయని కంటెంట్ ను తీసుకొని సినిమాను చక్కగా తీశారని చిత్ర బృందాన్ని అప్రిసియేట్ చేశారు.

రాణి సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా చిత్ర బృందం అనందోత్సాహాల మధ్య సంబురాలుచేసుకున్నారు అనంతరం

 

చిత్ర చూసిన ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు మాట్లాడుతూ..నేను ఇప్పటివరకు చాలా మంచి సినిమాలు తీశాను కానీ ఇలాంటి కొత్త కంటెంట్ ఉన్న సినిమా తీయలేదు.కొత్త కథతో ఎవరు తీయని విధంగా ఈ సినిమాను తీశారు సినిమా చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది రాఘవ అద్భుతమైన డైరెక్షన్ చేశాడు ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ని వీక్ నెస్ గా తీసుకొని రాఘవ అద్భుతంగా దర్శకత్వం చేసాడు. రాణి పాత్రలో శ్వేతా వర్మ చాలా చక్కగా నటించింది. దర్శకనిర్మాతలు కొత్త కంటెంట్ తో ఈ కథను ఎన్నుకొని మన ముందుకు వచ్చారు
విలన్ గా చేసిన శివ క్యారెక్టర్ చూస్తే ఇంత దుర్మార్గంగా కూడా ఉంటారా అనిపించింది.చాలా బాగా చేశాడు. కానిస్టేబుల్ గా చేసిన విక్రమ్ బాగా నటించాడు.ఈ సినిమాకీ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అవుతుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది . ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా రాణి. ఫస్ట్ బ్యానర్లోనే నిర్మాతలు ఇంత మంచి కథను ఎన్నుకొని సినిమా తీయడం వారి అభిరుచికి అభినందనీయం. ఇలాంటి కొత్త కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు ఈ సినిమా విజయంతో చిత్ర నిర్మాతలు ఇలాంటి మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నానని అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ,,ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్, డైరెక్టర్ నాగు గవర పలువురు పెద్దలు చిత్రబృందాన్ని అభినందించారు.

Facebook Comments
Rani Movie Receives Critical Acclaim - Producers Kishore Marishetti And Nazia Sheikh

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.