చెప్పినా ఎవ్వరూ నమ్మరు రివ్యూ & రేటింగ్!
సినిమా: చెప్పినా ఎవ్వరూ నమ్మరు
నటీనటులు: ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్
బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు
డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ
సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి
సంగీతం: జగదీశ్ వేముల
ఎడిటర్: అనకల లోకేష్
లిరిక్స్: భాస్కరభట్ల
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లు గా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నిర్మించిన “చెప్పినా ఎవరూ నమ్మరు” ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
ముగ్గురు యువకులు జీవితం గురించి ఆలోచిస్తూ ఏదైనా సాధించాలని అనుకుంటారు. ఆ క్రమంలో ఎటైనా వెళ్దాం అనుకొని గోవా బయలుదేరుతారు. గోవాలో వీరు మర్డర్ కేసులో ఎరుక్కుంటారు. ఈ విషయం ఒక జర్నలిస్ట్ ద్వారా వీరికి తెలుస్తుంది. గోవాలో వీరికి జోషఫ్ పరిచయం అవుతాడు. ఆ సమయంలో వీరి చేతిలో ఉన్న డ్రగ్స్ బాటిల్ కిందపడి పగిలిపోతుంది. ఆ బాటిల్ లో ఉన్న డ్రగ్ పవర్ వల్ల వీరందరూ మత్తులోకి వెళతారు. చివరకి వీరు ఏమయ్యారు ? జోషఫ్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే చెప్పినా ఎవ్వరూ నమ్మరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నూతన నటీనటులు అయిన సరే అనుభవం కలిగిన యాక్టర్స్ లాగా నటించారు. ఆర్యన్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసాడు.
నిర్మాత ఎం. మురళి శ్రీనివాసులు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా నిర్మించాడు. సినిమాటోగ్రఫీ అందించిన బురన్ షేక్, అఖిల్ వల్లూరి గురించి చెప్పుకోవాలి. సినిమాకు కావాల్సిన లొకేషన్స్ లో అందంగా చూపించారు. బడ్జెట్ లో కథను బాగా తెరమీద ఆవిష్క్రరించారు.
సంగీతం అందించిన జగదీశ్ వేముల పాటలతో పాటు నేపధ్య సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. కొన్ని ఎలివేషన్స్ ఎపిసోడ్స్ లో రీ రికార్డింగ్ సూపర్ గా ఉంది. ఎడిటర్ అనకల లోకేష్ సినిమా రన్ టైమ్ ఎక్కువగా లేకుండా షార్ట్ అండ్ స్వీట్ గా కట్ చేసాడు. భాస్కరభట్ల లిరిక్స్ మరో హైలెట్ అని చెప్పుకోవాలి.
యువత ఎలా ఆలోచిస్తారు ? సమస్యలను వారు ఎలా ఎదుర్కొంటారు వంటి అంశాలు సినిమాలో బాగా చూపించాడు దర్శకుడు ఆర్యన్ కృష్ణ. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. గోవాలో తీసిన ఎపిసోడ్స్ ఆసక్తికంగా ఉన్నాయి. ఈ కథకు కావాల్సిన లొకేషన్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. యువతకు కావాల్సిన అంశాలు సినిమాలో బాగున్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్ చూసే విధంగా కథ కథనాలు ఉండడం మరో హైలెట్. ఎక్కడా బోరింగ్ లేకుండా ఉన్న ఈ మూవీని రెండు గంటలు ఎంజాయ్ చెయ్యవచ్చు. కమర్షియల్ అంశాలతో పాటు ఒక చిన్న మెసేజ్ ఈ సినిమాలో ఉంది. మంచి సినిమా చూడాలి అనుకున్న వారు ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పినా నమ్మరు సినిమాను ఇష్టపడతారు.
రేటింగ్: 3/5
Cheppina evvaru nammaru 2021 telugu movie review and rating