చిత్రం: అన్నపూర్ణమ్మ గారి మనవడు
నటీనటులు: బాలదిత్య, అర్చన, అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ,జమున, బెనర్జీ, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు )
నిర్మాత: ఎమ్. ఎన్. ఆర్.చౌదరి
సంగీతం: రాజ్ కిరణ్
ఎడిటింగ్: నివాస్
కెమెరామెన్: గిరి కుమార్
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలలో నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎమ్.ఎన్. ఆర్ చౌదరి నిర్మించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి యాంత్రిక జీవనం సాగిస్తూ...మనుషుల మధ్య ఉండాల్సిన బంధాలు, అనుబంధాలు ,ప్రేమ,ఆప్యాయత లను మరచిపోతున్న తరుణంలో బంధాల ప్రాముఖ్యతను చాటుతుంది ఈ "అన్నపూర్ణమ్మ గారిమనవడు" సినిమా. పచ్చని పల్లెటూరిలో జరిగే నాయనమ్మమనవడి కథే ఈ చిత్రం.
విశ్లేషణ:
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కూతురు వాసిరెడ్డి అమృత,అక్కినేని అన్నపూర్ణమ్మ గారి కొడుకు అక్కినేని ప్రణయ్ ల మధ్య జరిగే అందమైన ప్రేమకథ. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారా..?లేక హతమార్చారా..? వీరి ప్రేమకు ప్రతి రూపమైన వంశీ తన నాయనమ్మ వద్ద కు ఎలాచేరాడు..?వంశీ తనమనవడు అని అన్నపూర్ణమ్మ ఎలా తెలుసుకుంటుంది..?అనే ప్రధాన కథాంశంతో సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో చిత్రాన్ని మలచిన తీరు దర్శకుడు నర్రాశివనాగేశ్వరరావు ప్రతిభను చాటుతుంది. ప్రత్యేకించి నాయనమ్మ,మనవడు మధ్య జరిగే సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తాయి. అలనాటి అందాలనటి జమున 40సంవత్సరాల తర్వాత నటించడం ఈ చిత్రానికి ఫ్లస్ అని చెప్పవచ్చు.
నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా చాలా గ్రాండ్ గా తీశారు. అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమాతో తాను మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. రఘుబాబు,సుమన్ శెట్టి,తాగుబోతు రమేష్,అదుర్స్ రఘు,జీవా ల కామిడీ ఆకట్టుకుంటుంది.రాజ్ కిరణ్ సంగీతం,గిరికుమార్ ఫోటోగ్రఫీ బాగున్నాయి. కుటుంబమంతా కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒక మంచి చూడాలనుకున్న వారు అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమాను హ్యాపీగా చూడవచ్చు.
రేటింగ్: 3/5
Annapoornamma gari manavadu telugu movie (2021) review and rating