Posani Launched By GST Movie Teaser

Posani Launched By GST Movie Teaser (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Posani Launched By GST Movie Teaser (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Posani Launched By GST Movie Teaser (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Posani Launched By GST Movie Teaser (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

"తోలుబొమ్మల సిత్రాలు" బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం G S T (God Saitham Technology). ఈ చిత్రం టీజర్ ని ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..."తోలుబొమ్మల సిత్రాలు" బ్యానర్ పై నిర్మిస్తున్న GST (God Saitham Technology) చిత్రాన్ని నా శిష్యుడు జానకిరామ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు.టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.ప్రేక్షకులను కోరుతున్నాను.జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి అభినందనలు " అన్నారు.

దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ... ముందుగా మా చిత్రం యొక్క టీజర్ ని లాంచ్ చేసిన మా గురువు గారైన పోసాని కృష్ణమురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇక అసలు విషయానికి వస్తే... సమాజంలో ఎంతో మందికి దేవుడి పైన,దెయ్యం పైన,సైన్స్ పైన ఎన్నో ప్రశ్నలు వున్నాయి. ఈ ప్రశ్నలు... ఇప్పుడే కాదు,మూఢనమ్మకాలను బలంగా నమ్మే ఆదికాలం నుండి ఎంతో టెక్నాలజీ పెరిగిన ఇప్పటి వరకు కూడా.. ఇంకా ప్రశ్నలు ఉద్బవిస్తూనే వున్నాయి. ఇలాంటి ప్రశ్నలే...రీసెంట్ గా "కరోనా" టైంలో కూడా వచ్చాయి. మనందరికి తెలిసిన విషయమే.."కరోనా" వచ్చింది. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయ్యింది. అన్ని మూత పడ్డాయి. అందులో భాగంగా... అన్ని మతాల దేవాలయాలు కూడా మూత పడ్డాయి. అప్పుడూ..దేవాలయాలు మూత పడ్డాయి,మరీ దేవుడు ఎక్కడున్నాడు ?, దేవుళ్ల గురించి మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెబుతారు అని చాలా మంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. ఇలా దేవుళ్ళ గురించి ప్రశ్నిస్తున్న సందర్భంలో "కరోనా" అనే సైతాన్.. ఇక్కడ మనం కరోనా ని ఎక్సంఫుల్ గా సైతాన్ అనుకుందాం. కరోనా అనే సైతాన్ ఒక దేశం నుంచి మరొక దేశానికి, పట్నం నుంచి పల్లెటూళ్ల కి పాకి,ప్రపంచం మొత్తాన్ని అష్టదిగ్బంధం చేసి,ప్రపంచంలోని జనాలందరినీ భయ బ్రాంతులకి గురి చేసి,కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నది కదా..! మరి అప్పుడు.. కరోనా అనే సైతాన్ గెలిచిందనుకోవాలా..?,దేవుళ్ళు ఓడి పోయారనుకోవాలా..?

అంతెందుకు.. కరోనా వచ్చి, తగ్గిన వాళ్లలో కొందరు.. దేవుడి దయ వల్ల బతికి బయట పడ్డాము కాబట్టి "దేవుడు" వున్నాడని కొందరంటున్నారు.కరోనా వచ్చిన వాళ్ళు కొందరు హాస్పిటల్ లో చేరి డాక్టర్స్ సలహాలు పాటించి,కరోనా నుంచి కోలుకున్నవాళ్ళు..డాక్టర్లే దేవుళ్ళు అని మరికొందరంటున్నారు.ఇక కరోనా సోకి చనిపోయిన వాళ్లలలో..ఈ మాయదారి మహమ్మారి కరోనా "సైతాన్"లా పట్టి మా వాళ్ళను బలి తీసుకుందని మరికొందరంటున్నారు.

ఇలా కరోనా ప్రపంచాన్నే గజగజ లాడించిన టైం లో కూడా సమాజంలో చాలా మంది దేవుడి గురించి, దెయ్యం గురించి, సైన్స్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ప్రశ్నించుకుంటున్నారు.మరి ఏది వాస్తవం అనుకోవాలి ?

దేవుడ్ని సృష్టించింది మనిషి అని,కాదు..మనిషి ని సృష్టించింది దేవుడనీ..ఇలా ఎన్నో ప్రశ్నలు మనుషుల మధ్య వున్నవి కాబట్టే... ఆ ప్రశ్నల్లోంచి నేను ఒక కంటెంట్ తీసుకుని, దాన్ని ఒక బలమైన కథగా మలిచి.. అందరికీ నచ్చేలా లవ్,కామెడీ, హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో మంచి మెసేజ్ ఇస్తున్న మా కమర్షియల్ చిత్రాన్ని అన్ని వర్గాల వారు ఆదరిస్తారని భావిస్తున్నాను.

మరొక్కసారి.. మా చిత్రం టీజర్ ని లాంచ్ చేసిన మా గురువు గారికి,మీ కందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని దర్శకుడు అన్నారు.

ఈ చిత్రం లో హీరోలు : ఆనంద్ కృష్ణ,అశోక్, హీరోయిన్లు: స్వాతి మండల్, యాంకర్ ఇందు,పూజ సుహాసిని, కామెడీ పాత్రలో జూనియర్ సంపూ, ఇతర తారాగణం: వెంకట్,నందు,వాణి, స్వప్న, "వేదం"నాగయ్య, గోవింద్, నల్లి సుదర్శనరావు,"జానపదం"అశోక్, రాథోడ్ మాస్టర్, సూర్య, సంతోష్, రమణ.
ఎడిటింగ్ : సునీల్ మహారాణ
డి.ఓ.పి : డి.యాదగిరి
సంగీతం : యు.వి.నిరంజన్
నిర్మాత : కొమారి జానయ్య నాయుడు
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం : కొమారి జానకిరామ్
పి.ఆర్.ఓ : మధు.వి ఆర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%