Social News XYZ     

Bobby Yedida Creative Works And Evergreen Entertainments Jointly Producing A Suspense Thriller Starring Ashish Gandhi And Chitra Shukla

ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల కాంబినేష‌న్‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌

‘నాట‌కం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల‌రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొంద‌నుంది. రాజ్‌కుమార్ బాబీ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ప‌తాకంపై బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

నిర్మాత‌లు బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ... ఇదొక స‌స్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. సినిమా ప్రారంభ స‌న్నివేశం నుంచి ఆఖ‌రి స‌న్నివేశం వ‌ర‌కూ చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ క‌థ‌లోని మ‌లుపులు ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తాయి. `నాట‌కం` త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆశిష్ గాంధీ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌నున్నారు. `రంగుల రాట్నం`, `సిల్లీ ఫెలోస్‌`, `మా అబ్బాయి` చిత్రాల ఫేమ్ చిత్ర శుక్ల ఇందులో క‌థానాయిక‌. ఇత‌ర తారాగ‌ణం వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. డిసెంబ‌ర్ మొద‌టి వారం నుంచి రాజ‌మండ్రి, కాకినాడ‌, నిడ‌ద‌వోలు, రంప‌చోడ‌వ‌రం, గుడిసె, రాజాన‌గ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతాం అని తెలిపారు.

 

ఈ చిత్రానికి క‌థ‌: బాబీ ఏడిద‌, ర‌చ‌న‌: స‌ర‌దా శ్యా‌మ్‌, డీఐ-విజువ‌ల్ ఎఫెక్ట్స్ : బ‌ండారు సాయి శ్రీ‌కాంత్‌, కాస్టూమ్
డిజైన‌ర్ : రూప‌రేఖ గుత్తి, ఛాయా గ్ర‌హ‌ణం: హ‌రిక్రిష్ణ (బెంగ‌ళూర్‌), సంగీతం: పెద్ద‌ప‌ల్లి రోహిత్‌, నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్ బాబీ.

Facebook Comments
Bobby Yedida Creative Works And Evergreen Entertainments Jointly Producing A Suspense Thriller Starring Ashish Gandhi And Chitra Shukla

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: