దీపావళి కానుకగా నవంబర్ 12న ఆకాశంనీహద్దురా విడుదల సందర్భంగా స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ సుధ కొంగర తెలుగు సినీ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సమావేశంలో చర్చించిన కొన్ని ముఖ్యాంశాలు
సూర్య - ఆకాశం నీ హద్దురా చిత్రం నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ కథలో హీరో అందరు అసాధ్యం అనుకున్నే దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడు. ఇప్పుడు సాధరణ ప్రజలు కూడా విమానం ఎక్కి తిరుగుతున్నారంటే దానికి కారణం డెక్కన్ ఏయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్, ఆయన వ్యక్తిగత అంశాలు కొన్ని తీసుకొని ఈ కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారు సుధ కొంగర, ఇది మనందరి కథ అందుకే అందరికీ తప్పక నచ్చుతుందని అని నేను బలంగా నమ్ముతున్నాను.
సుధ కొంగర - సూర్య గారు చెప్పినట్లుగా ఈ సినిమా మా టీమ్ అందరికీ ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఈ సినిమా కథ మొత్తం ఓ సాధరణ మనిషి చేసిన అసాధారణ పని చుట్టే తిరుగుతూ ఉంటుంది. రూపాయి ఇస్తే చాలా విమానం ఎక్కేయవచ్చు అనే నమ్మకాన్ని జనాల్లో కలిగించిన వ్యక్తి గురించి ఈ సినిమా చెబుతోంది. సూర్య గారు ఆన్ స్క్రీన్ గోపీనాధ్ గా ఒదిగిపోయారు.
సూర్య - కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ మా టీమ్ కి ఎంతో ఉపయోగపడింది. ఈ టైమ్ లో మా ప్రాజెక్ట్ కి కావాల్సిన గ్రాఫిక్స్, సీజీ వర్క్స్ మరింత న్యాచురల్ గా ఉండేలా డిజైన్ చేసుకునే వీలు కలిగింది. బెటర్ అవుట్ పుట్ వచ్చిందని మేము భావిస్తున్నాము
సుధ కొంగర - లాక్ డౌన్ కారణంగా మా టీమ్ మొత్తానికి కావాల్సినంత టైమ్ దొరికింది, ఆడియెన్స్ మరింత ఎంటర్ టైన్ చేసే విధంగా ఈ సినిమాను మేము రెడీ చేయగలిగాము
సూర్య - ఎన్నో పాత్రలు చేసాను, నా గత చిత్రాలు గజిని, సింగం, సూర్య సన్ ఆఫ్ క్రిషనన్ లో చాలా వేరేయేషన్స్ ఉన్న గెటెప్స్ వేశాను, కానీ ఆకాశంనీహద్దురా లో మాత్రం ఒకరు నిజజీవితంలో చేసిన పనుల్ని నేను అదే రీతిలో ఆన్ స్క్రీన్ చూపించాల్సి వచ్చింది. నా పెర్ఫార్మెమెన్స్ విషయంలో ఎక్కువ దృష్టి పెట్టాను. ఓ సగటు మనిషిగా, ఓ ఎయిర్ ఫోర్స్ కెప్టేన్ గా ఇలా పలు రకాలు షేడ్స్ ఉన్న పాత్రల్లో ఈ సినిమాలు కనిపించబోతున్నాను. ఈ కథ విన్నప్పుడు నన్ను ఎగ్జైట్ చేసింది కూడా ఈ చిత్రంలో నా పాత్ర స్వభావమే, సుధ డైరెక్షన్ స్కిల్స్ తో పాటు సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాలు కలిసికట్టుగా వారిలో ఉన్న పూర్తి నైపుణ్యాన్ని పెట్టి ఈ సినిమాకి వర్క్ చేశారు.
సుధ - అండర్ డాగ్ కథలు అంటే నాకు చాలా ఇష్టం, హీరో అంటే ఇట్టే కొట్టేసి అట్టే గెలిచేసి వెళ్లిపోతే నాకు నచ్చుదు. ఈ కథలో హీరో కూడా తను అనుకున్నది సాధించడానికి పడ్డ కష్టాల్లోంచి మనందరం ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఇదే ఎజెండా నేను ఈ సినిమాను తెరకెక్కించాను
సూర్య - కరోనా కారణంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అవుతున్నా ఇంట్లో ఫ్యామిలితో కలిసి హాయిగా హోమ్ థియేటర్ లో లేదా టీవిల్లో సినిమాను ఆస్వాదించే వీలు కలుగుతుంది ఓటిటిలు కారణంగా, ఇందులో అమెజాన్ వారు ఆడియెన్స్ కి ఎంటర్ టైన్మెంట్ ని మరింత దగ్గర చేస్తున్నారు. అంటే నేనే ఓటిటిలకు సపోర్ట్ చేస్తూ థియేటర్స్ ని తక్కువ చేస్తున్నట్లు కాదు. నా బ్యానర్ లో ఇంకా పది సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. నా చుట్టూ ఉన్న వారి కోసం నేను కొన్ని సాహసమైన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రస్తుతం పరిస్థుతుల్లో నేను తీసుకున్న నిర్ణయం సరైనదని నేను భావిస్తున్నాను
సుధ - ఎప్పుడో 10 ఏళ్ల తరువాత ఓటిటిల ప్రభావం ఉంటుందని నేను అనుకున్నాను, కానీ మనందరికి వచ్చిన ఈ విపత్తు కారణంగా ఓటిటిలు ముందుకు వచ్చాయి. ఇలా రావడం కూడా మంచిదే, ఆడియెన్స్ ని ఎంటర్ టైన్మెంట్ నుంచి దూరం అవ్వకుండా ఓటిటిలు బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే థియేటర్స్ మళ్లీ ఓపెన్ అయ్యాక ఆడియెన్స్ ఈ రెండు మీడియమ్స్ లో సినిమాలు చూస్తారు.
సూర్య - నవంబర్ 12న ఆకాశం నీ హద్దురా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకుల నన్ను నా టీమ ని ఆదిరించాలని కోరుకుంటున్నాను
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.