టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవి ఆర్ ఆర్ ఆర్.. ఈ చిత్రం లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ లు నటిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా పరిచయం అయ్యారు. ఇక కొమరం భీం గా ఎన్ టి ఆర్ పరిచయానికి చాలా ఆటంకాలు ఎదరయ్యాయి. అయితే ఎట్టకేలకు కొమరం భీం పుట్టిన రోజు సంధర్బంగా ఈ రోజు విడుద ల చేసారు. దీనికి దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, నిర్మాత ధానయ్య లు.
ఇక ఈ టీజర్ విషయానికొస్తే వాటర్ లో బల్లెం తీయటం నుండి మెదలయ్యి ఎన్ టి ఆర్ సిక్స్‌ప్యాక్ చూపించటం తో ముగుస్తుంది. అయితే అల్లూరి సీతారామరా పాత్ర ధారి రామ్‌చరణ్ కొమరం భీం గురించి మెదలుపెడుతూ. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ..వాడు భూతల్లి చనుపాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు వీరుడు కొమరం భీం. అంటూ రామ్ చరణ్ విజువల్ కి తగ్గట్టుగా వాయిస్ పిచ్ పెంచుతూ చెప్పటం ఈ టీజర్ కి హైలెట్ గా నిలిచింది.
గతం లో ఎన్ టి ఆర్ వాయిస్ తో టీజర్ ఎంత సక్సయిందో. ఇప్పడు రామ్ చరణ్ అందించిన ఈ వాయిస్ తో విజువల్ గా చాలా బాగుందనిపించింది. చక్కటి పద ప్రయోగం తో రామ్ చరణ్ ఊచ్చారణ బాగుంది. ఫైనల్ గా రెండు టీజర్స్ లో ఇద్దరి హీరోల వాయిస్ లు డామినేట్ చేసాయి.
This website uses cookies.