రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా 'క్రాక్'లో ఓ స్పెషల్ సాంగ్‌లో అప్సరా రాణి
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్' షూటింగ్ ముగింపు దశలో ఉంది.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో ప్రస్తుతం రవితేజ, అప్సరా రాణిలపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఎస్. తమన్ స్వరాలు కూర్చిన ఈ మాస్ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సాంగ్‌కు జాని మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పేరుపొందిన తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలతో, ఉద్వేగభరితమైన కథ, కథనాలతో సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు 'క్రాక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'మెర్సాల్', 'బిగిల్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి.
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: బి. మధు
బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పాటలు: రామజోగయ్య శాస్త్రి
పీఆర్వో: వంశీ-శేఖర్
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.