సెప్టెంబర్ 8న విడుదలవ్వనున్న ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975 మొదటిపాట
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975 ఆడియో నుంచి మొదటి సింగిల్ విడుదల చేయడానికి యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ట్యూన్స్ తో స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన చూసాలే కళ్లారా అనే పాటను సెప్టెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఇక "రాజావారు రాణిగారు" సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమై మొదటి సినిమాతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975 అనే వినూత్న సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించినట్లుగా చిత్ర నిర్మాతలు ప్రమోద్, రాజులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ లిరిక్ రైటర్ క్రిష్ణ కాంత్ గారు రాసిన లిరిక్స్, చిత్ర సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్(ఆర్ ఎక్స్ 100 ఫేమ్) కంపోజేసిన ట్యూన్స్, స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ వాయస్ తో చూసాలే కళ్లారా అంటూ సాగే ఈ పాటను ప్రేక్షకుల్ని కచ్ఛితంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లుగా చిత్ర దర్శకులు శ్రీధర్ గాదే తెలిపారు. సెప్టెంబర్ 8న ప్రముఖ మ్యూజిక్ కంపెనీ లహరీ ఆడియో వారి అఫీషియల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాట విడుదల అవుతున్నట్లుగా చిత్ర దర్శక నిర్మాతల ప్రకటించారు. "ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్" పతాకం పై అత్యంత ప్రామాణిక నిర్మాణ విలువలతో నిర్మాతలు ప్రమోద్, రాజు లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ విధించే సమయానికి కడప, రాయచోటి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రకీరణ పూర్తి చేసినట్లుగా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదే తెలిపారు. ఈ సినిమాతో శ్రీధర్ దర్శకునిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
తారాగణం
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జావాల్కర్, సాయికుమార్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ : ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు : ప్రమోద్ - రాజు
కెమెరా : విశ్వాస్ డేనియల్
సంగీతం : చైతన్ భరద్వాజ్
ఏఆర్ఓ : ఏలూరు శ్రీను
దర్శకత్వం : శ్రీధర్ గాదె
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.