Social News XYZ     

Prabhas Released Krishnudu’s My Boy Friend’s Girl Friend Movie First Look

ప్రభాస్ చేతుల మీదుగా మై బాయ్
ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్స్‌ ఫస్ట్ లుక్ లాంచ్

వినాయకుడు ఫేమ్ కృష్ణుడు నిర్మాతగా వస్తున్న సినిమా మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్స్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ నిర్మించారు. త్వరలోనే ఓటిటి లో రిలీజ్ కానున్న ఈ సినిమా కు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభినందనలు తెలియజేశారు..
సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 

ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా అందరికి నచ్చేలా కంప్లీట్ లవ్ కామెడీ ఎంటర్ టైనర్ గా మా సినిమా ఉంటుంది అన్నారు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తు న్నామన్నారు నటుడు , నిర్మాత కృష్ణుడు.ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ ను దర్శకుడిగా తెలుగు తెర కు పరిచయం చేయబోతున్నాడు కృష్ణుడు

Facebook Comments