అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ కె . రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో టీటీడీ ఆద్వర్యంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణంకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులు కొనసాగాలని శాస్తోత్రంగా శ్రీ కె . రఘురామకృష్ణంరాజు పూజలు చేసారు.
ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఆలయ పూజారులను ఆయన ఘనంగా సత్కరించారు .జై శ్రీరామ్... జైజై శ్రీరామ్ నినాదాలను చేసారు.
అయోధ్యలోరామాలయం నిర్మాణానికి జరిగే కరసేవతో సహా అన్ని కార్యక్రమాలలో తాను పాల్గొంటానని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేస్తున్న భూమి పూజ భారత దేశ చరిత్రలో ఒక మైలు రాయి, దేశచరిత్రలో చిరస్మరణీయమైన రోజు .
కోట్లాది ప్రజలు చిరకాల వాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం ...
అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని యావత్తు దేశ ప్రజలు హర్షిస్తున్నారు.
రాముడు పుట్టిన అయోధ్యలో గుడి కట్టుకోవాలన్న కోట్లాది మంది రామభక్తుల అభిలాష నెరవేరడం ఒక అద్భుత అనుభూతి .
మనం కొలిచే దేవుడికి జన్మస్థానంలోఆలయం నిర్మించుకోవడానికి దశాబ్దాల పోరాటం చేయాల్సిరావడం మన సెక్యులర్ భావ పునాదుల పటిష్టతకు ఇదే చక్కటి నిదర్శనం.
ఆలస్యంగా అయినా అభిలాష నెరవేరడం ప్రతి రామభక్తుడికి పరమానంద కరము...
కులమతాలకు అతీతంగా యావత్ దేశం రామమందిరం నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారు.
రామాలయం నిర్మాణానికి అయోధ్య జరిగే భూమి పూజ కార్యక్రమం రోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ లేఖ రాసిన పూజ కార్యక్రమాలు నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించక పోవడం చాల బాధాకరం.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగే రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు , వేద పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉంటే కోట్లాది ప్రజలు ప్రభత్వ నిర్ణయంను అభినందించి జేజేలు పలికేవారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి జరిగే భూమి పూజ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఎందుకు నిర్వహించలేదో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ప్రభత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.
అయోధ్య లో రామాలయం నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఆద్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ఎందుకు చేయడం లేదో టీటీడీ అధికారులు జవాబు చెప్పాలి.
హిందువుల మనోభావాలను గౌరవించి అయోధ్యలో రామాలయం నిర్మాణం కు భూమి పూజ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక్క సందేశం ఇస్తే బాగుండేది.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.