Sana Yadi Reddy To Direct And Produce And Movie Base 2004 Real Life Incident Titled Nuvvante Nenani

Sana Yadi Reddy To Direct And Produce And Movie Base 2004 Real Life Incident Titled Nuvvante Nenani (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Sana Yadi Reddy To Direct And Produce And Movie Base 2004 Real Life Incident Titled Nuvvante Nenani (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

సానా యాదిరెడ్డి దర్శక నిర్మాతగా 2004లో జరిగిన యదార్ధ ప్రేమకథా చిత్రం 'నువ్వంటే నేనని'

తెలుగు సినీ ప్రేక్షకులకు సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సానా క్రియేషన్స్ బ్యానర్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సానా యాది రెడ్డి దర్శక నిర్మాతగా 'పిట్టల దొర' బ్యాచిలర్స్ , సంపెంగి, ప్రేమ పల్లకి, జై బజరంగభళి వంటి స్మాల్ బడ్జెట్ తో తీసిన మూవీస్ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ లు సాధించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందునుండే తెలంగాణ ప్రాంతానికి చెందిన కళా కారులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి కె చెందుతుంది. ఇక విషయానికొస్తే..... 2004వ సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న సరి కొత్త ప్రేమకథ తో ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ మీ ముందుకొచ్చారు సాన యాది రెడ్డి. నూతన హీరో హీరోయిన్లు నకుల్, శ్వేతా లను పరిచయం చేస్తూ సానా భాగ్య లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది షూటింగ్ ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని కరోనా క్రైసిస్ కి ముందుగానే ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత సానా యాది రెడ్డి మాట్లాడుతూ - " తెలుగు ప్రేక్షకులు పీరియాడికల్, బయోపిక్ చిత్రాలను ఆదరిస్తారని ఇటీవల సక్సెస్ సాధించిన 'రంగ స్థలం' 'మహా నటి' 'జార్జి రెడ్డి' 'యాత్ర' వంటి చిత్రాలు నిరూపించాయి. అదే స్ఫూర్తి తో నేను ఓ కథ రెడీ చేశాను. 2004 హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల ఆధారంగా రాసుకున్నసరి కొత్త ప్రేమకథను తెరకెక్కిచాను. నా బ్యానర్ ద్వారా అప్పట్లో కమెడియన్ గా చేస్తున్న అలీ ని పెట్టి 'పిట్టల దొర' గా, సంపెంగి చిత్రంతో హీరో హీరోయిన్ లు గా దీపక్, కాంచి కౌల్ ని, బ్యాచిలర్స్ సినిమాతో శివాజీ వంటి హీరోను పరిచయం చేయడం జరిగింది. ఇప్పడు మళ్ళీ నూతన హీరో హీరోయిన్లతోనే 'నువ్వంటే నేనని' అనే చిత్రాన్ని నిర్మించాను. అదే విధంగా వరికుప్పల యాదగిరిని పాటల రచయితగా నా చిత్రాల ద్వారానే పరిచయం చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాకి అతని పాటలు ఓ హైలెట్ గా నిలుస్తాయి. గత ఏడాది షూటింగ్ పార్ట్ పూర్తి చేసి, ఈ ఏడాది జనవరి లో మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ చేసాం. అయితే జనవరిలో పెద్ద సినిమాల రిలీజ్ లు వుంటాయని విడుదల కార్య క్రమాలు నిలిపి వేసాము. పైగా ఈ సినిమాలో ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునే ఎలిమెంట్ ఎక్కువగా వున్నాయి అందుకనే పరీక్షలు అయిపోయాకా అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేసి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాను కానీ కుదరలేదు. కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కుంటున్నపరిస్థితిలో లాక్ డౌన్ పెట్టడం, ప్రజలు భయాందోళనలతో వున్నా సమయంలో థియేటర్ కి వచ్చి సినిమా చూసే అవకాశం లేకపోవడం, పైగా రోజు రోజుకి కరోనా కేసులు ఉధృతంగా పెరిగిపోతున్నా ఈ సమయంలో థియేటర్లు, మల్టి ఫ్లెక్సులు ఈ ఏడాది ఆఖరు వరకు కూడా తెరిచే అవకాశం లేదని సినిమా పెద్దలు చెప్పగా, మా సినిమాని నేరుగా ఇంట్లోనే కుటుంబ సమేతంగా చూసే విధంగా ఓ టి టి ద్వారా విడుదల చేయాలనీ భావించాను. నా గత చిత్రాలను ఆదరించారు అదే విధంగా నా తాజా చిత్రం 'నువ్వంటే నేనని' ని కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను"అన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.