I Am Ready To Do Role That Have Scope For Performance – Manali Rathod

I Am Ready To Do Role That Have Scope For Performance – Manali Rathod (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
I Am Ready To Do Role That Have Scope For Performance – Manali Rathod (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
I Am Ready To Do Role That Have Scope For Performance – Manali Rathod (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

పర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలు చెయ్యడానికి నేను రెడీ - హీరోయిన్ ''మనాలి రాథోడ్"

గ్రీన్ సిగ్నల్, ఫ్యాషన్ డిజైనర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మనాలి రాథోడ్ జులై 15న తన పుట్టినరోజు జరుపుకోనుంది ఈ సందర్భంగా తనతో ఇంటర్వ్యూ...

నేనే నా ప్రతి పుట్టినరోజును ఏదో ఒక హోమ్ ఏజ్ లో ఫౌండేషన్ పీపుల్ తో చేసుకొనే దానిని, ఈసారి కరోన కారణంగా బయటికి వెళ్లడం కుదరదు కావున ఒక చిన్నపిల్లల అనాధ శరనాలయంలో వారికి కాచాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసి అందిస్తున్నాను.

నేను నటి అవ్వడానికి ఇన్స్పిరేషన్ 7/జి బృందావన కాలిని హీరోయిన్ సోని అగర్వాల్, నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని మా ఇంట్లో జరిగింది, ఆ టైమ్ లో సోని అగర్వాల్ గారిని చూసి నటి అవుదామనిపించింది. నాకు ఇండస్ట్రీలో రోల్ మాడల్ మాత్రం విద్య బాలన్ గారు, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను.

ఇటీవలే నేను నటించిన రన్ సినిమా అహలొ విడుదల అయ్యింది. నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ గారు నిర్మించగా లక్ష్మీకాంత్ చెన్న గారు డైరెక్ట్ చేశారు.

2019 నవంబర్ లో విజిత్ ను వివాహం చేసుకున్నాను. తను బిజెపి యూత్ లీడర్, మాది లివ్ కమ్ అరంజ్డ్ మ్యారేజ్, మ్యారేజ్ లైఫ్ బాగుంది.

నేను నటించిన ఒక తమిళ్ సినిమా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో విడుదలకు సిద్దంగా ఉంది. తెలుగులో కొందరు దర్శకులు అప్రోచ్ అయ్యారు. త్వరలో వాటి వివరాలు చెబుతాను. ఫఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోల్స్ చెయ్యడానికి సిద్దంగా ఉన్నాను. త్రివిక్రమ్, రాజమౌళి, క్రిష్ దర్శకుల దగ్గర వర్క్ చెయ్యాలని ఉంది.ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ వున్నారు, అందరూ టచ్ లో ఉన్నారు, యాక్టర్ నవీన్ నేనీ నాకు బెస్ట్ ఫ్రెండ్.

అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి బయటికి వెళ్లొద్దు, కరోన రోజు రోజుకు బాగా పెరుగుతుంది, అయినా సరే కొందరు మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను, రూల్స్ పాటించాలి.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%