Social News XYZ     

Krishna Vamsi’s Gulabi Is Jilebi Of Love Stories

ప్రేమ కథా చిత్రాల్లో జిలేబి కృష్ణవంశీ 'గులాబీ'

ప్రేమకు గులాబీకి చాలా పోలికుంటుంది .ప్రేమ గులాబీ అంత అందంగా ఉంటుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక ప్రేమికుడి ,గులాబీ లాంటి అమ్మాయి ప్రేమకథ ఈ గులాబీ చిత్రం."నీ కష్టంలో నేను ఉన్నాను నీ చంపల్లో జారి నీ గుండెల్లో చేరి కరిగే నీ కన్నీరౌతాను " ప్రేమిక గురించి కన్నీరై ప్రేక్షకుల గుండెల్ని కరిగించిన చంద్ర శేఖర్ బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ టైమ్ ప్రేమకథ.

చిత్రానికి న్యూ నెస్ ఒక ప్రత్యేకత. కృష్ణవంశీ దర్శకత్వంలో మొదటి సినిమా ,గాయకురాలు సునీత ,సంగీత దర్శకుడు శ శీ ప్రీతం హీరోయిన్ మహేశ్వరి వీళ్ళందరికీ మొదటి చిత్రం . వర్మ స్కూల్ విద్యార్థి కృష్ణ వంశీ తన పాఠాలను మర్చిపోకుండా దాదాపు చిత్రం మొత్తం వాల్ల స్కూల్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాడు అని చెప్పచ్చు.
చిత్రం మొదలవగానే , అమ్మాయిలను ఎత్తు కొచ్చి వ్యభిచార గృహాలకు అమ్మేసే గాంగ్ ని చూపటం రాబోయే విషాదానికి సూచకంగా ఉంటుంది . కాని కథల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ల తరవాత కథని నడిపించే అంశం మిడ్ పాయింట్ . ఈ మిడ్ పాయింట్ మిడిల్లో రాకుండా ముందే చూపటం ఒక కొత్తదనం.చంద్ర శేఖర్ బిటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ టైమ్ చదివే ఒక యువకుడు.అల్లరి చిల్లరి గ్రూప్ గాంగ్ లీడర్.ఒక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని ఎత్త కొచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం,అక్కడ ఫైట్స్ చేయటం సాహసాలు చేయటం,ఆ క్రమంలో లో హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. పూజ (మహేశ్వరి) ధనవంతుల అమ్మాయి .పూజ అతని ఫైట్స్ సాహసాలు చూసి మోహంలో పడిపోతుంది .ల్యాండ్ లైన్ ఫోన్ కి ఫోన్ చేసి అతని బయోడేటా చెప్పి ఆమె ఎవరో చెప్పకుండా చాలా రోజులు దాచిపెట్టి ఊరిస్తుంది. అతడు డ్రీమ్ గర్ల్ మొహం లో పడి "డ్రీమ్ గర్ల్ మెడలో మాల వేసే డార్లింగ్ డాల్" అని పాడుతుంటాడు . హీరోటిక్ గానే అమ్మాయి అడ్రస్ కనుక్కుకుంటాడు.చంద్ర శేఖర్ ఫ్రెండ్ రాంబాబు డబ్బు పిచ్చి ఉంటుంది వాడు పూజను విలన్ జీవ కి అమ్మేస్తాడు .విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తన ప్రియురాలిని రక్షించుకుంటాడు.

 

కధ నడుస్తున్నప్పుడు ఊహించని మలుపులు, డైలాగ్ లో సహజత్వం,మోడ్రన్ తండ్రి పాత్రలో చంద్రమోహన్ ,చిత్రం ఫ్యాషన్ నీ మరింత పెంచాయి.
చిత్రానికి సినిమాటోగ్రఫీ సన్నివేశానికి తగ్గట్లుగా లైటింగ్ అర్రెంజ్మెంట్, చురుకుగా కెమెరా కదలికలు అద్భుతమైనవి. రాహుల్ ఎల్లోరా శ్రమ,చెమటి చుక్కలు, దర్శకుడు కృష్ణవంశీ, హీరో జేడి.చక్రవర్తి.హీరోయిన్ మహేశ్వరి,విల్లన్ జీవా ని ఆకాశంలో చుక్కలుగా మెరిసేలా చేసాయి.

రాహుల్ ఎల్లోరాహీరోయిన్ అందచందాలు చూపించటంలో,ఫైట్ సీన్లో హీరో కి శ్రమ లేకుండా కేవలం కెమెరా కదలికలతో ఆ ఫైట్ సన్నివేశాలను పండించాడు. ఈ చిత్ర విజయానికి ప్రముఖమైన పాత్ర వహించిన సినిమాటోగ్రాఫర్ రాహుల్ ఎల్లోరా ను గొప్పగా ప్రశంసించి తీరాలి.

హీరోయిన్ మహేశ్వరీ చిలిపి పాత్రలో చక్కగా ఒదిగిపోయి ఆ పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి.నత్తి నత్తి మాటలతో సహజంగా ప్రేక్షకులను అలరించింది.

జేడి.చక్రవర్తి మీద కృష్ణవంశి పెట్టుకుని నమ్మకాన్ని కాపాడి చిత్ర విజయానికి ప్రముఖమైన పాత్ర వహిస్తూ తార పదంలో మంచి నటుడుగా మిగిలిపోయాడు.

దర్శకుడు కృష్ణవంశి మేఘాలలో తేలిపొమ్మని అనే బైక్ పాట చిత్రీకరణ ఇండియన్ సినిమా లో కొత్త ప్రయోగం. ఈ పాట చిత్రీకరణతో ఇతను ఒక్క సినీ మేధావి అని అర్ధమవుతుంది.బలమైనకథ కథనంతో ప్రేక్షకులను కొత్త అనుభూతిని కలిగించాడు.

సినిమా కి సంగీతం చక్కగా కుదిరింది.సన్నివేశానికి తగట్టుగా ఉండే పాటలు, సింగర్ సునీత కు మొదటి పాటతోనే పెద్ద బ్రేక్ వచ్చింది.మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం వెస్ట్రన్ మ్యూజిక్ తో సినిమాకి న్యూనెస్ తీసుకొనివచ్చి తనఖాతాలో బిగెస్ట్ విజయంను సొంతం చేసుకున్నాడు.

- సీతామాధవి ఏలూరి

Facebook Comments