Film Is An Emotion. No Matter How Many New Technologies Come In, The Film Never Stops – Producer SKN

Film Is An Emotion. No Matter How Many New Technologies Come In, The Film Never Stops – Producer SKN (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Film Is An Emotion. No Matter How Many New Technologies Come In, The Film Never Stops – Producer SKN (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Film Is An Emotion. No Matter How Many New Technologies Come In, The Film Never Stops – Producer SKN (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Film Is An Emotion. No Matter How Many New Technologies Come In, The Film Never Stops – Producer SKN (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

సినిమా అనేది ఒక ఎమోషన్ - ఎన్ని కొత్త టెక్నాలిజీలు వచ్చినా, సినిమా ఆగిపోదు - నిర్మాత ఎస్ కే యెన్

టాక్సీ వాలా సినిమా తో నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, ప్రతి రోజు పండగే వంటి మరో బ్లాక్ బస్టర్ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత ఎస్ కే యెన్ జులై 7న తన జన్మదినం సందర్బంగా ఈ రోజు సినీ పాత్రికేయలుతో ముచ్చటించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో తాను నిర్మించిన టాక్సీవాలా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా, టీవీ లో టెలికాస్ట్ అయినా ప్రతి సారి మంచి రేటింగ్స్ అందుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.

టాక్సీవాలా ఐనా వెంటనే సుప్రీమ్ హీరో సాయి తేజ్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో బన్నీ వాసు నిర్మించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ప్రతి రోజు పండగే కి సహ నిర్మాతగా వ్యవహరించడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఇదే ఉత్సహంతో ప్రస్తుతం మారుతీ గారు డైరెక్షన్ లో ఓ స్టార్ హీరో తో తెరకెక్కబోతున్న సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా తెలిపారు. అలానే ప్రముఖ ఓటిటి కి మారుతీ గారు పర్యవేక్షణలో చేయబోతున్న వెబ్ సిరీస్ కి నిర్మాతగా ఉండబోతున్నట్లు తెలిపారు ఎస్ కే యెన్. సాయి రాజేష్ డైరెక్టర్ గా కూడా ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న అని అన్నారు.

వీటితో పాటు టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ ప్రస్తుతం చేస్తున్న శామ్ సింగరాయ్ సినిమా పూర్తి ఐనా వెంటనే తనతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ఎస్ కే యెన్ అన్నారు. యంగ్ హీరో అల్లు శిరీష్ తదుపరి సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉండబోతున్న అని, ఈ కరోనా క్రైసిస్ ముగిసిన వెంటనే తాను పని చేస్తున్న ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటనలు రాబోతున్నాయి అని అన్నారు. ఇక ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పై ఓటిటిల ప్రభావం ఎక్కువైంది అనే వాదనకు తనదైన శైలి లో సమాధానం ఇచ్చారు ఎస్ కే యెన్.

ఎన్ని టెక్నాలజీలు వచ్చిన సినిమా ఇండస్ట్రీకి ఏం కాదు అని అన్నారు. జనాలు థియేటర్స్ కి వెళ్లడం మానరు అని తెలిపారు. అలానే ప్రస్తుతం థియేటర్స్ మూసి ఉండటం వలన, ఆల్రెడీ రిలీజ్ కావాల్సిన సినిమాలని జనాలకి చేరే వేసే మాధ్యమంగా ఓటిటి లు నిర్మాతలకు కాస్త ఊరట నివ్వడం వాస్తవం, కానీ ఈ కారణంగా థియేటర్ వ్యూయర్షిప్ తగ్గాయిపోతుంది అనే వాదనతో నేను ఎకీవభించను అని అన్నారు. సినిమా అనేది ఎవర్ గ్రీన్, విసిఆర్ లు, టీవీలు ఇలా టెక్నాలజీలు ఎన్ని వచ్చిన థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం అనేది ఆడియన్స్ ఆపలేదు.

ఈ పంధాలోనే ఓటిటి లు కూడా వచ్చాయి, ఈ మధ్యే శ్రేయాస్ ET ATT కూడా విజయవంతమైంది సంతోషం ఇవన్నీ విజయవంతమైన కూడా సినిమాలు ఎవర్ గ్రీన్ ఎప్పటికి థియేటర్ ఎక్సీపీరియెన్స్ ని కొట్టేది లేదు ఎందుకంటే మనకి మనసు బాగా లేకపోతే సినిమాకు వెళ్తాము మనసు బాగున్నా సినిమాకి వెళ్తాం సినిమా అనేది మన కల్చర్ సినిమా మీద లక్షల మంది జీవనోపాధి ఆధారపడి ఉంది అలా థియటర్స్ కల్చర్ బతికింది భవిషత్తు లో కూడా బతికే ఉంటుంది ఎన్ని వచ్చిన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం అనేది ఓ ఎమోషన్, అన్ని వర్గాలు వారికి అందుబాటులో లో ఉండే ఏకైక ఎంటర్టైన్మెంట్, థియేటర్ కి వెళ్లి సినిమా చూడటమే అని అన్నారు ఎస్ కే యెన్. ఇక ఈ మధ్య మలయాళం సినిమాలు మాదిరిగా తెలుగు లో సినిమాలు ఎందుకు రావడం లేదని కొందరు అనడం తనకు బాధ కలిగించినట్లుగా తెలిపారు.

మనకి ఏది ఇష్టమో ఇంట్లో ఉండే అమ్మకి లేదా భార్యకి తెలుస్తుంది అని, అప్పుడప్పుడు హోటల్ లో ఫుడ్ తిన్నంత మాత్రాన అమ్మ చేతి వంటకి వంకలు ఎలా ఐతే పెట్టామో, ఏదొక మలయాళీ సినిమా బాగుంది అని ఆ సినిమాలను మన తెలుగు సినిమాలతో పోల్చి చూడటం సరికాదని మన మేకర్స్ మనకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో చూసి మన అభిరుచికి అనుగుణంగా సినిమాలు రూపొందిస్తారు అని అన్నారు దేశమంతా మన వైపు చూసిన రీతిన అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగులో సినిమాలు రూపొందుతున్నాయి అని అన్నారు. బాహుబలి, అల వైకుంపురంలో వంటి హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న సినిమాలు తెలుగు లో నిర్మించినవే అనే విషయం మర్చిపోకూడదు అని అన్నారు.అలానే తన స్నేహితులు నిర్మాత బన్నీ వాసు దగ్గర నుంచి సినిమా, కథలు జడ్జిమెంట్ ని, దర్సకుడు మారుతీ దగ్గర నుంచి పాత్రలు, ఆడియన్స్ పల్స్ తదితర అంశాలు నేర్చుకుంటా అని తెలిపారు ఎస్ కే యెన్.

కరోనా నేపథ్యంలో ప్రజలు అత్య అవసరం ఐతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావాలని, వీలైనంత వరకు, ఇంటికే పరిమితమవ్వడం అన్ని విధాలుగా మంచిదని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ విపత్తు నుంచి బయట పడే మార్గాన్ని చూపించాలని ఆ దేవుడు ని ప్రార్థిస్తూనట్లుగా తెలిపారు ఎస్ కే యెన్

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%