జోగినపల్లి సంతోష్ కుమార్ సౌజన్యం 'మనం సైతం' సారధ్యంలో చిత్రపురి కాలనీవాసులకు మాస్కుల పంపిణీ!!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు, తెరాస ముఖ్య నేత జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశీస్సులతో.. 'మనం సైతం' సారధ్యంలో.. చిత్రపురి కాలనీలో ఇంటింటికి మాస్క్ లు పంపిణి చేశారు.
'మాస్క్' నిత్యావసర వస్తువుగా మారిపోయిన నేపథ్యంలో తమ కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాస్కులు పంపిణీ చేయించిన జోగినపల్లి సంతోష్ కుమార్, 'మనం సైతం' కాదంబరి కిరణ్ లకు కాలనీవాసులు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, మాస్క్ లేకుండా బయట తిరగడం నేరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కాదంబరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు!!