అందాల ఆకాష్ మళ్లీ అదరగొడుతున్నాడు!
అసాధారణ విజయం సాధించిన 'ఆనందం'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన అందాల కథానాయకుడు ఆకాష్.. 'వసంతం, అందాల రాముడు, గోరింటాకు, నమో వేంకటేశ' తదితర చిత్రాలతోనూ విశేషంగా ఆకట్టుకున్నారు.
కెరీర్ పరంగా ఇటీవల కాస్తంత వెనకబడ్డ ఆకాష్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పూర్వ వైభవం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఆకాష్ కన్నడలో నటించిన 'జోతాయి.. జోతాయల్లీ' అనే సీరియల్ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఇదే సీరియల్ తమిళంలో.. 'నీతానై ఎంతన్ పొన్వసంతన్' పేరుతో జీ-తమిళ్ లో డైలీ సీరియల్ గా ప్రసారమవుతూ... తమిళనాట ఆకాష్ పేరు మారుమ్రోగేలా చేస్తోంది. అంతేకాదు.. ఆకాష్ నటించిన అయిదు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.
'ఏ-క్యూబ్' పేరుతో ఒక మూవీ యాప్ ను కూడా సిద్ధం చేసుకున్న ఆకాష్... 'అందాల రాక్షసుడు'గా తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు!!