ఆ ప్రాంతం కళాకారుల నైపుణ్యానికి మారుపేరు. సామాన్యులకు అందుబాటులో ఉండే వస్త్రాల నుంచి.. అతి ఖరీదైన వస్త్రాలను అక్కడ నేస్త్తారు. అక్కడ మగ్గాలపై నేతన్నలు.. చేయాడిస్తే తయారయ్యే వస్త్రాల సొగసు వర్ణనాతీతం. నేర్పరితనానికి అదొక నిదర్శనం. అంతటి గొప్ప ఖ్యాతి...వెంకటగిరి చేనేత వస్త్ర పరిశ్రమ సొంతం. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ పరిశ్రమ నేడు ఒక్కసారిగా చితికిపోయింది. లాక్ డౌన్ తో పనులు లేక కార్మికులు అకలితో మలమలా మాడుతున్నారు. బ్రాండ్ విలువతో నెలనెలా కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఆ చోట...నాలుగు నెలలుగా ఒక్క చీర అమ్ముడు పోలేదు. చేనేత మగ్గంపై ఎన్నో బతుకులు ఆధారపడి ఉన్నాయి. మగ్గంపై పనిచేస్తేనే వారికింత ఉపాధి. అలాంటి మగ్గాల పరిశ్రమపై కూడా కక్ష కట్టింది కరోనా వైరస్. లాక్‌డౌన్ సమయంలో చేనేత రంగం నిలువునా చితికిపోయింది
#IdiSangathi
#EtvAndhraPradesh
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
ఆ ప్రాంతం కళాకారుల నైపుణ్యానికి మారుపేరు. సామాన్యులకు అందుబాటులో ఉండే వస్త్రాల నుంచి.. అతి ఖరీదైన వస్త్రాలను అక్కడ నేస్త్తారు. అక్కడ మగ్గాలపై నేతన్నలు.. చేయాడిస్తే తయారయ్యే వస్త్రాల సొగసు వర్ణనాతీతం. నేర్పరితనానికి అదొక నిదర్శనం. అంతటి గొప్ప ఖ్యాతి...వెంకటగిరి చేనేత వస్త్ర పరిశ్రమ సొంతం. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ పరిశ్రమ నేడు ఒక్కసారిగా చితికిపోయింది. లాక్ డౌన్ తో పనులు లేక కార్మికులు అకలితో మలమలా మాడుతున్నారు. బ్రాండ్ విలువతో నెలనెలా కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఆ చోట...నాలుగు నెలలుగా ఒక్క చీర అమ్ముడు పోలేదు. చేనేత మగ్గంపై ఎన్నో బతుకులు ఆధారపడి ఉన్నాయి. మగ్గంపై పనిచేస్తేనే వారికింత ఉపాధి. అలాంటి మగ్గాల పరిశ్రమపై కూడా కక్ష కట్టింది కరోనా వైరస్. లాక్‌డౌన్ సమయంలో చేనేత రంగం నిలువునా చితికిపోయింది #IdiSangathi #EtvAndhraPradesh