Social News XYZ     

Producer Bunny Vaas Celebrated His Birthday With Family And Friends

కుటుంబ స‌భ్యుల‌, స‌న్నిహితులు స‌మ‌క్షంలో పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న‌ సూప‌ర్‌హిట్స్ కి కేరాఫ్ అడ్రాస్ గా మారిన నిర్మాత బ‌న్నివాసు

స్టైలిష్ స్టార్ అల్టు అర్జున్ త‌న మెద‌టి చిత్రం గంగోత్రి త‌రువాత బ‌న్ని కి ఒక స్నేహితుడి గా పరిచ‌యం అయ్యిన ఉద‌య్ శ్రీనివాస్ త‌న ఆర్థిక ప‌రిస్థుతుల అప్ అండ్ డౌన్ అవ్వ‌టంతో మ‌ద్య‌లో త‌న చ‌దువు ఆపేసి అల్లు ఫ్యామిలి స‌పోర్ట్ తో తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చారు. పాల‌కొల్లు లో పుట్టి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుకుని హ‌య్య‌ర్ ఎడ్యూకేష‌న్ అంతా వైజాగ్‌, ఢిల్లి లాంటి ప్రాంతాల్లో పూర్తిచేసారు. చ‌డువు మ‌ధ్య‌లో ఆగిపోయిన‌ప్ప‌డు ఒ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా బ‌న్ని కి ప‌రిచ‌యం అయ్యిన ఉద‌య్ శ్రీనివాస్‌ త‌రువాత వెన‌క్కి చూసుకొలేదు. బ‌న్నికి స్నేహితుడు కావ‌టం ఇండస్ట్రి లో స‌న్నిహితులంద‌రూ బ‌న్నివాసు అని పిల‌వ‌టంతో ఉద‌య్ శ్రీనివాస్ బ‌న్ని వాసుగా ఫేమ‌స‌య్యాడు. వెబ్ మీడియా లో వున్న‌ప్ప‌డు ద‌ర్శ‌కుడు మారుతి ఫ్రెండ్‌. ఆర్య చిత్రం లో బ‌న్ని వాసు ఒచోట త‌లుక్కుమంటారు. ఆ చిత్రం ఆయ‌న కెరీర్ ని మార్చింద‌నే చెప్పాలి. ఆర్య చిత్రం పాల‌కొల్లు రైట్స్ కోసం వెళ్ళిన బ‌న్ని వాసు కి నిర్మాత దిల్ రాజు గారు స‌పోర్టు తో వెస్ట్ గోదావ‌రి జిల్లా లో మెట్ట‌మెద‌టి సారిగా డిస్ట్రిబ్యూట‌ర్ గా అవ‌తార‌మెత్తాడు. ఆ త‌రువాత వ‌రుస చిత్రాలు చేస్తూ గుంటూరు జిల్లాలో కూడా సినిమా డిస్ట్రిబ్యూష‌న్ చేసి స‌క్స‌స్ ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్ గా పేరుగాంచారు. ఆ త‌రువాత గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెట్టమెద‌టి సారిగా యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా 100% లవ్ చిత్రంతో నిర్మాత‌గా మార‌ట‌మే కాకుండా త‌రువాత సుప్రీమ్‌హీరో సాయిధ‌ర్మ్ తేజ్ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం విజ‌యం తో సూప‌ర్‌హిట్‌ ప్రోడ్యూస‌ర్ గా క్రేజ్ ని సంపాయించారు.

ఆ త‌రువాత జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో నాని హీరోగా భలే భలే మగాడివోయ్, అల్లు శిరిష్ హీరోగా శ్రీరస్తు శుభమస్తు, విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గీత గోవిందం, సాయిధ‌ర్మ్‌తేజ్ హీరోగా ప్రతిరోజూ పండగే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యంగ్ ఎన‌ర్జిటిక్ ప్రోడ్యూస‌ర్ గా బ‌న్నివాసు త‌న‌కంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం నిర్మాత గా అఖిల్ అక్కినేని హీరోగా మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ , కార్తికేయ హీరోగా చావు క‌బురు చ‌ల్లగా మ‌రియు ఎంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా 18 పేజీస్ చిత్రాలు ర‌న్నింగ్ లో వున్నాయి. ఇంకా కొన్ని ప్రోజెక్ట్స్ సిట్టింగ్ ద‌శ‌లో వున్నాయి. మెస్ట్ క్రెజియ‌స్ట్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు గారి పుట్టిన‌రోజు ని కుటుంబ‌స‌భ్యులు మ‌రియు స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రుపుకుంటున్నారు.

 

Facebook Comments