రఘు 'రామ బాణం' !
ఆయన ఫస్ట్ టైమ్ ఎంపీ. ఆయన ఏం చేసినా సంచలనమే, ఆయన ఏం మాట్లాడినా మీడియాకు మేతే, స్వపక్షంలో విపక్షం, విపక్షంలో స్వపక్షం ఆయన. ఎవరిది ఏ పక్షమైన ప్రతిక్షణం ప్రజాపక్షంలో నిలబడే ఆయనే ఎంపీ కనుమూరి రఘు రామ కృష్ణంరాజు.
ముక్కుసూటి స్వభావం ఆయనకున్న , ముఖ స్తుతి ఆయనకు తెలియదు అనుకున్నా, మనసులో ఉన్నది మొహమాటం లేకుండా మాట్లాడడమే ఆయనకు తెలిసిన విద్య. హైకోర్టు తీర్పుల విషయంలో, పంచాయితీలకు పార్టీ రంగుల విషయంలో ఇసుక దోపిడీ విషయంలో నిమ్మగడ్డ న్యాయ పోరాట విషయంలో రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యానాలు రాష్ట్రంలో అందరిని ఆశ్చర్యపరిచాయి. ఆయన ఆలోచనకు అసమ్మతి అని పేరు పెట్టిన ఆయన ప్రశ్నలకు పెడ అర్థాలు తీసిన ఆయన మాత్రం తన పంథా మార్చుకోరు. నమ్మిన దాన్ని నిజాయితీగా చెప్పడమే ఆయన బలం, బలహీనత. మా ముఖ్యమంత్రి మల్లెపువ్వే కానీ ఆయన చుట్టు ఉన్న కోటరీయే ముళ్లకంప అని రఘు రామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కొంత ఆందోళనలు దారి తీసిన ఆయన చెప్పిన విషయం మాత్రం అందరిని ఆలోచనలో పడేసింది. పార్టీని ఇరుకున పెట్టడం, ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడం పరిష్కరం కోసం చేతనైనంత ప్రయత్నం చెయ్యడమే నా లక్ష్యం అని చెప్పే రఘురామ కృష్ణంరాజు మాటల్ని అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థులు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి.
పవర్ ప్రాజెక్ట్స్ తో పారిశ్రామిక వేత్తగా పాపులర్ అయిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు పవర్ పాలిటిక్స్ లో కూడా పవర్ ఫుల్ గానే రాణిస్తున్నారు. వైసిపి ఎంపీగా నరసాపురం లోకసభ స్థానం నుండి ఫస్ట్ టైమ్ గెలిచిన దగ్దర నుండి రఘురామ కృష్ణంరాజు తన మార్కు రాజకీయలతో జనంతో దూసుకుపోతూనే ఉన్నారు. ఇటు ప్రజా క్షేత్రంలో అటు పార్లమెంట్ వేదికగా ఇటు సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనదైన పంథాలో అడుగులు వేస్తున్న రఘురామ కృష్ణంరాజుకి ఇవి కొత్తేమి కాదు. పడవిలోకి రాకముందు కూడా సంక్రాంతి కోడి పంధ్యాల విషయంలో ఆయన పోరాటం తెలుగువారికి సుపరిచితమే.ఎంపీగా గెలిచిన తరువాత కూడా కోడి పంధ్యాల విషయంలో తన వైఖరి మార్చుకోకపోవడానే ఆయన నిబద్ధతకు నిదర్శనంగా ఆయన అభిమానులే కాదు అందరూ అంటారు.
అటు ప్రజా క్షేత్రంలో ఇటు ప్రసార సాధనాల్లో తనదైన సెన్సేషన్ క్రియేట్ చేసిన రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ సభ్యుడుగా కూడా కొత్త సంచలనానికి తెరతీశారు. 2019 - 20 సంవత్సరానికి విడుదలైన ఎంపీ కార్డ్స్ లో ఆంధ్రప్రదేశ్ లోనే బెస్ట్ పెర్ఫార్మింగ్ పార్లమెంటేరియన్ గా రఘు రామ కృష్ణంరాజు ఎంపిక అయ్యారు. పార్లమెంట్ సభ్యుల హాజరు నేషనల్ యావరేజ్ 85 శాతం, స్టేట్ యావరేజ్ 81 శాతం ఉండగా రఘురామ కృష్ణంరాజు ఏకంగా 97 శాతం యకారేజ్ తో దుమ్ములేపారు. పార్లమెంట్ డిబేట్ విషయంలో కూడా ఆయన తన ప్రేత్యేకత చాటుకున్నారు. డిబేట్స్ లో రఘురామ కృష్ణంరాజు 42 శాతం సాధించగా అదే సమయంలో నేషనల్ యావరేజ్ 16.5, స్టేట్ యావరేజ్ కేవలం 13 శాతంగా ఉండడం గమనర్ధం. హాజరు విషయంలో మాత్రమే కాదు పార్లమెంట్ లో ప్రశ్నలు సంధించడంలో కూడా రఘురామ కృష్ణంరాజు తన ప్రేత్యేకత చాటుకున్నారు. కొశ్యన్ విషయంలో స్టేట్, సెంట్రల్ యావరేజ్ కేవలం 49 శాతం ఉండగా రఘురామ కృష్ణంరాజు ఏకంగా 91 శాతం యావరేజ్ సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎంతోమంది సీనియర్ పార్లమెంట్ సభ్యులను వెనక్కినెట్టి ఫస్ట్ టైమ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తన పెర్ఫార్మెన్స్ తో రిపోర్ట్ కార్డ్స్ లో అగ్రస్థానానికి ఎగబాకారు.
రిపోర్ట్ కార్డ్స్ లో రికార్డుల మోత మోగించడమే కాదు పార్లమెంట్ సబాడినెట్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ గా ఎన్నికై పార్లమెంట్ చరిత్రలోనే ఆ పదవి స్వీకరించిన ఫస్ట్ టైమ్ పార్లమెంటేరియన్ గా రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే ఒక అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. పార్లమెంట్ రూల్స్ కమిటీ, పవర్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీస్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ వంటి ఆరు అతి ముఖ్యమైన పార్లమెంట్ కమిటీల్లో కూడా రఘురామ కృష్ణం రాజు మెంబర్ గా భాద్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. పదిహేడవ లోక్ సభ మొత్తంలో ఏకంగా ఆరు కమిటీల్లో సభ్యులుగా ఉన్నవాళ్లు రఘురామ కృష్ణంరాజు కాకుండా కేవలం ఇద్దరు అంటే ఇద్దరు మాత్రమే ఉన్నారంటే పార్లమెంట్ సభ్యునిగా రఘురామ కృష్ణంరాజు సంపాదించుకున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది.
మన దేశంలో పదవిలోకి వస్తే ప్రజల్ని మరిచిపోయే నాయకులకు లోటు లేదు. అధిష్ఠానం అడుగులకు మడుగులెత్తే వీర విధేయులకు లోటు లేదు. కానీ నమ్మింది చెప్పాలంటే ధైర్యం కావాలి. ప్రజల పక్షాన నిబడాలంటే సాహసం కావాలి. ఎవరికి ఆగ్రహం వచ్చినా పరివాలేదు ప్రజలకు పార్టీకీ మంచి జరిగితే చాలు. ఇదే రఘురామ కృష్ణంరాజు ఫిలాసఫీ. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ తరువాత అదే పంచె కట్టుతో అదే ఆహార్యంతో పార్లమెంట్ వేదికగా చక్రం తిప్పుతున్న రఘురామ కృష్ణం రాజు మీద ప్రజలకు మాత్రమే కాదు, పార్టీలకు కూడా చాలా అంచనాలు ఉన్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ కూడా రఘురామ కృష్ణంరాజుని పలకరించే విధానం చూస్తే దేశ రాజధానిలో ఈ రఘురాముడికి ఉన్న గ్రిప్ ఏంటో అర్థం అవుతుంది. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో రఘురామ కృష్ణంరాజు చేస్తున్న ప్రయత్నాలకు సందిస్తున్న ప్రశ్నలకు కొందరు విపరీత అర్థాలు తీస్తున్న ఆయన గురించి తెలిసిన వారు మాత్రం ఆయన వర్షన్ ను సపోర్ట్ చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో న్యూస్ మేకర్ గా మారిన ఆంధ్ర అంబానీ రఘురామ కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తుందో, మరెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.