Normalcy Yet to be Restored in Viag's RR Venkatapuram | LG Polymers Gas Leakage Incident | Idi Sangathi | 12th May 2020
గాలి, నీరు, నేల..! ఇవి ఎంత స్వచ్ఛంగా ఉంటే.. మనిషి అంత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతాడు. ఏది కలుషితమైనా...ప్రాణాలకు ముప్పు తప్పదు. వాటి మనుగడ సాఫీగా సాగినంత వరకే మనకు రక్ష. మరి ఈ విషయంలో ఏ మేర అప్రమత్తంగా ఉంటున్నాం..? ఊపిరి అందించే గాలే...ఉసురు తీస్తోందంటే...లోపం ఎక్కడుంది..? విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తరవాత ఈ ప్రశ్నలే...అందరినీ వెంటాడుతున్నాయి. మానవ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది...ఆ పారిశ్రామిక ప్రమాదం. కొందరికి కడుపు కోత మిగిల్చింది. మరికొందరి గుండెల్లో ఆవేదన తీరనిది. ఇందుకు ప్రధాన కారణం.. ఆ పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువు. ఏ గాలైతే ప్రాణం నిలబెడుతుందో...అదే గాలి కలుషితమై ఇప్పుడు పర్యావరణాన్నీ, మనుషుల జీవితాల్నీ అస్తవ్యస్తం చేసింది.
ఒక పెను ప్రమాదం. ఆ దుర్ఘటన కలలో కూడా ఊహించలేదు... ఆ అయిదు గ్రామాల ప్రజలు. తెల్లారితేగానీ తెలియలేదు, తమకేమైందని. 5రోజులైనా... ఆ ఆవేదన, ఆందోళన తగ్గలేదు. ఎందుకంటే... తమ బతుకులు ఎప్పటిలా ఉంటాయని, ఆరోగ్యాలకు, అస్తిత్వానికి ప్రమాదం ఏం లేదని ఆ అభాగ్యులకు ఎవరూ భరోసా ఇవ్వలేని దుస్థితి. ప్రభుత్వం ఇచ్చినా పరిహారాలు, నేతల పరామర్శలూ వారిలో ఏమాత్రం ధైర్యం నింపలేకపోతున్నాయి. నెలలా... సంవత్సరాలా... మళ్లీ సాధారణ పరిస్థితులు రావటానికి ఎన్ని రోజులు పడతాయో తెలీదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ అయినా వారికి ఊరటనిచ్చే మార్గం కనిపిస్తుందా?
ఆర్. ఆర్. వెంకటాపురం కుదుటపడ్డట్టేనా? అక్కడి గాలిని స్వేచ్ఛగా పీల్చుకోవచ్చా..? పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో...పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలివే. ప్రస్తుతం ఆ ప్రాంతం మాత్రం పూర్తిగా కోలుకున్నట్టు కనిపించటం లేదు. ప్రమాదం జరిగిన తరవాత వేరే చోటుకు తరలి వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు. తగ్గట్టుగానే...పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలో స్టైరీన్ ఆనవాళ్లున్నాయని తేలటం...వారి భయాన్ని రెట్టింపు చేసింది. వాతావరణంపై స్టైరీన్ ప్రభావం తీవ్రంగా ఉందంటున్న పర్యావరణ నిపుణులు...ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం... స్థానిక పర్యావరణంపై ఏ స్థాయిలో దుష్ప్రభావం చూపిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది మేఘాద్రిగడ్డ జలాశయం. ఘటన జరిగిన ఆర్‌ఆర్ వెంకటాపురం ప్రాంతానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మంచినీటి వనరులో అకస్మాత్తుగా వచ్చిన మార్పు.. విశాఖకు మరో సమస్యగా మారింది. రిజర్వాయర్‌లోని నీటి మొత్తాన్నీ దాదాపు మిల్లీమీటరు మందంతో ఆవరించిన ఆకుపచ్చని తెట్టు.. ఇప్పటికే జరిగిన జల విధ్వంసాన్ని కళ్లకు కడుతోంది. మేఘాద్రిగడ్డ ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలన కథనాన్ని ఇప్పుడు చూద్దాం.
#IdiSangathi
#EtvAndhraPradesh
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Normalcy Yet to be Restored in Viag's RR Venkatapuram | LG Polymers Gas Leakage Incident | Idi Sangathi | 12th May 2020 గాలి, నీరు, నేల..! ఇవి ఎంత స్వచ్ఛంగా ఉంటే.. మనిషి అంత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతాడు. ఏది కలుషితమైనా...ప్రాణాలకు ముప్పు తప్పదు. వాటి మనుగడ సాఫీగా సాగినంత వరకే మనకు రక్ష. మరి ఈ విషయంలో ఏ మేర అప్రమత్తంగా ఉంటున్నాం..? ఊపిరి అందించే గాలే...ఉసురు తీస్తోందంటే...లోపం ఎక్కడుంది..? విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తరవాత ఈ ప్రశ్నలే...అందరినీ వెంటాడుతున్నాయి. మానవ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది...ఆ పారిశ్రామిక ప్రమాదం. కొందరికి కడుపు కోత మిగిల్చింది. మరికొందరి గుండెల్లో ఆవేదన తీరనిది. ఇందుకు ప్రధాన కారణం.. ఆ పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువు. ఏ గాలైతే ప్రాణం నిలబెడుతుందో...అదే గాలి కలుషితమై ఇప్పుడు పర్యావరణాన్నీ, మనుషుల జీవితాల్నీ అస్తవ్యస్తం చేసింది. ఒక పెను ప్రమాదం. ఆ దుర్ఘటన కలలో కూడా ఊహించలేదు... ఆ అయిదు గ్రామాల ప్రజలు. తెల్లారితేగానీ తెలియలేదు, తమకేమైందని. 5రోజులైనా... ఆ ఆవేదన, ఆందోళన తగ్గలేదు. ఎందుకంటే... తమ బతుకులు ఎప్పటిలా ఉంటాయని, ఆరోగ్యాలకు, అస్తిత్వానికి ప్రమాదం ఏం లేదని ఆ అభాగ్యులకు ఎవరూ భరోసా ఇవ్వలేని దుస్థితి. ప్రభుత్వం ఇచ్చినా పరిహారాలు, నేతల పరామర్శలూ వారిలో ఏమాత్రం ధైర్యం నింపలేకపోతున్నాయి. నెలలా... సంవత్సరాలా... మళ్లీ సాధారణ పరిస్థితులు రావటానికి ఎన్ని రోజులు పడతాయో తెలీదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ అయినా వారికి ఊరటనిచ్చే మార్గం కనిపిస్తుందా? ఆర్. ఆర్. వెంకటాపురం కుదుటపడ్డట్టేనా? అక్కడి గాలిని స్వేచ్ఛగా పీల్చుకోవచ్చా..? పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో...పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలివే. ప్రస్తుతం ఆ ప్రాంతం మాత్రం పూర్తిగా కోలుకున్నట్టు కనిపించటం లేదు. ప్రమాదం జరిగిన తరవాత వేరే చోటుకు తరలి వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు. తగ్గట్టుగానే...పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలో స్టైరీన్ ఆనవాళ్లున్నాయని తేలటం...వారి భయాన్ని రెట్టింపు చేసింది. వాతావరణంపై స్టైరీన్ ప్రభావం తీవ్రంగా ఉందంటున్న పర్యావరణ నిపుణులు...ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం... స్థానిక పర్యావరణంపై ఏ స్థాయిలో దుష్ప్రభావం చూపిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది మేఘాద్రిగడ్డ జలాశయం. ఘటన జరిగిన ఆర్‌ఆర్ వెంకటాపురం ప్రాంతానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మంచినీటి వనరులో అకస్మాత్తుగా వచ్చిన మార్పు.. విశాఖకు మరో సమస్యగా మారింది. రిజర్వాయర్‌లోని నీటి మొత్తాన్నీ దాదాపు మిల్లీమీటరు మందంతో ఆవరించిన ఆకుపచ్చని తెట్టు.. ఇప్పటికే జరిగిన జల విధ్వంసాన్ని కళ్లకు కడుతోంది. మేఘాద్రిగడ్డ ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలన కథనాన్ని ఇప్పుడు చూద్దాం. #IdiSangathi #EtvAndhraPradesh