విశాఖ దుర్ఘటన పై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి.
విశాఖ పట్నం లో ఎల్జీ పాలిమార్స్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువు లీక్ అవడం అనేక మంది చనిపోవడం వందలాది మంది ఆస్పత్రుల పాలవ్వడం అనేక జంతువులు చనిపోవడం చాలా మంది భయ బ్రాంతులకు గురయ్యారు కరోనా ఎఫెక్ట్ తో యావత్ ప్రపంచం చిన్న భిన్నం అయిపోతున్న సమయంలో ఉత్తరాంధ్రలో ఈ ఘటన జరగడం చాలా హృదయ విదారకం. ఏడుపోస్తుంది.
మన భారతదేశంలో పివి నరసింహారావు గారు ప్రధాని గా వున్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రి గా వున్నప్పుడు 85... 90..దశకం లో wTO తో కుదుర్చుకున్స ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటి. ఏ బహుళ జాతి కంపెనీలను, ఏ కార్పొరేట్ శక్తులను,ప్రవేట్ శక్తులను అభివృద్ధి పేరుతో మన దేశంలో కి ఆహ్వానిస్తున్నామో...దాని దుష్పరిణామమే ఈరోజు దక్షిణ కొరియా కి సంబంధించిన కంపెనీలో జరిగిన దుర్ఘటన.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పచ్చని ఉత్తరాంధ్ర ఉడుకుతోంది. కేవలం కొంత మంది స్వార్ధపరులు అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్రను దుష్పరిణామాలకు ప్రయోగం గా చేస్తున్నారు. ఎల్జీ పాలి మార్స్ సంస్థ ను ప్రధాని మోడీ నిషేధించాలి.వాళ్ళ నుంచి కోట్ల రూపాయల నష్ట పరిహారం తీసుకోవాలి. వాళ్ళను శిక్షించి న్యాయం చేయాలి.
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికంగా నష్టపోయింది. శ్రీ కృష్ణ కమిటీ రాయలసీమ ఉత్తరాంధ్రా బాగా వెనుకబడిన ప్రాంతాలు వాటికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పింది.NDA గవర్నమెంట్ కూడా ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా ఇస్తాము అన్నారు. కానీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వకున్న, ప్రత్యేక పాకేజ్ లు ఇవ్వకున్న ఎన్నికల్లో YS జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవరత్నాలు ప్రకటించారో అవన్నీ సమర్ధంగా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి ని తట్టుకొని ప్రజలకు ది బెస్ట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నిధులున్నాయా లేవా అని కూడా చూడకుండా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి ఆర్ధిక సహాయం ప్రకటించి మానవీయ కోణం చూపిస్తున్నందుకు జగన్ మోహన్ రెడ్డి కి నా సెల్యూట్..నరేంద్రమోదీ గారు మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు.ప్రత్యేక ప్యాకేజి ఇవ్వలేదు.జాతీయ విపత్తు నిధి నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు నిధులు మంజూరు చేసి జగన్ మోహన్ రెడ్డి గారి కి ఇ క్లిష్ట పరిస్థితుల్లో చేయుత నిచ్చి ఆంధ్ర ప్రదేశ్ ను ఆదుకోండి......ఆర్.నారాయణ మూర్తి.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Watch R #NarayanaMurthy Gets Emotional On Vizag Issue Please Subscribe us : https://goo.gl/N1GMjx For more updates about Telugu cinema: Like on Facebook - https://www.facebook.com/manastarsdotcom Follow us on Twitter - https://twitter.com/manastarsdotcom