Social News XYZ     

Tamil Digitally Restored Version Of Blockbuster 16 Vayathinile Will Be Releasing Dubbed In Telugu Titled Neekosam Nireekshana

Films about actor Sridevi have been a staple of cinema for over a century. It is a remake of Bharathiraja's Tamil film 16 Vayathinile (1977) Dolby video's, which starred Sridevi, Kamal Hassan, and Rajinikanth.

The film marked Sridevi's debut in. Now Tamil digitally restored version of Blockbuster 16 Vayathinile will be releasing dubbed in Telugu, titled: Neekosam Neereekshanaa !!

The movie is presented by supreme almighty Creations. ... It was produced by Bama Rajkannu, Music by Aditya Music...soon in cinemascope.

 

లాక్ డౌన్ లో లిక్కర్ షాప్స్ బంద్ అని బాధ పడుతున్నారా? పాత సీసా లో కొత్త సరుకు మీ సంగీత దాహాన్ని తీర్చడానికి వచ్చింది.

భారత చిత్ర పరిశ్రమలో నటదిగ్గజాలు అయినటువంటి సూపర్ స్టార్ రజినీకాంత్, మహానటుడు కమల్ హాసన్ మరియు అందాల తార శ్రీదేవి నటీనటులుగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం "పదినారు వయదినిలే". ఈ చిత్రం 4 రాష్ట్రీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా. ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి జాతీయ పురస్కారాన్ని మరియు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి,అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది.ఈ చిత్రానికి తెలుగులో "నీకోసం నిరీక్షణ" అనే శీర్షిక ను ఖరారు చేశారు.

ఈ చిత్రాన్ని వెయ్యి థియేటర్లలో విడుదల చేయవలసి ఉండగా, ప్రస్తుత విపత్కర పరిస్థితుల మూలంగా సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి, తదుపరి ఇంకా అయిదు భాషల్లో దీనిని అనువాదం చేయనున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది.ఈ చిత్ర పోస్టర్లు మరియు విశేషాలను ట్విట్టర్, ఫేస్బుక్ మరియు బామా రాజ్ కణ్ణు యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు. పాత మధురమైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర నిర్మాత బామా రాజ్ కణ్ణు అభిప్రాయపడ్డారు. ఆదిత్యా మ్యూజిక్ యూట్యూబ్ ద్వారా 5 కొత్త సాంగ్స్ విడుదల చేసినట్టు ఆమె తెలిపారు. పూర్తీ సినిమా ను తెలుగులో జూన్ నెలలో ఆన్ లైన్ ద్వారా రిలీజ్ చేస్తామని నిర్మాత బామా రాజ్ కణ్ణు తెలిపారు. సుమారు 30 నిముషాల నిడివి దృశ్యాలను మార్పులు,చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నట్టు ఆమె వివరించారు.

Facebook Comments