Social News XYZ     

Producer Bekkem Venu Gopal Birthday Interview Stills

థియేటర్ కు ప్రత్యామ్నాయం థియేటర్ యే. విశ్వక్ సేన్ తో ''పాగల్'' తరువాత శ్రీవిష్ణుతో సినిమా చెయ్యబోతున్నాను - నిర్మాత "బెక్కం వేణుగోపాల్".

2006లో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టిన నిర్మాత బెక్కం వేణు గోపాల్ "టాటాబిర్లా మధ్యలో లైలా", "ప్రేమ ఇష్క్ కాదల్", "మేము వయసుకు వచ్చాం", "హుషారు" లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీ లో అభిరుచి గా నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలసి "నేను లోకల్" వంటి సూపర్ హిట్ చిత్రాలకు అసోసియేట్ అయ్యారు. ఏప్రిల్ 27న బెక్కం వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ...

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి...

 

ఇలాంటి విపత్కర పతిస్థితి ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను. ఈ కరోన మహమ్మారి త్వరగా ఈ ప్రపంచం నుండి తొలిగిపోయి మునుపటి పతిస్థితులు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అవాంతరాలు ఏ వంద సంవత్సరలకోసారో వస్తోంది. ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితులను ప్రజలు జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఇంటినుండి బయటకు రాకుండా ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తూ నేను ఇంట్లోనే ఉంటున్నాను. బర్త్ డే కూడా ఇంట్లోనే జరుపుకుంటున్నాను.

కరోన తరువాత ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారా ?

ఆడియన్స్ ఇప్పుడు ఎక్కువగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలు చూస్తున్నారు, భవిషత్తులో ఈ ప్రభావం థియేటర్స్ మీద ఉండదని భావిస్తున్నాను, ఎందుకంటే బిగ్ స్క్రీన్ అనుభూతి వేరు, బిగ్ స్క్రీన్ కు ప్రత్యామ్నాయం బిగ్ స్క్రీన్ యే. డిజిటల్ అనుభూతి వేరు, గతంలో ఇంటర్నెట్ వచ్చిన తరువాత జనాలు సినిమా థియేటర్స్ కు పెద్దగా రారు అన్నారు కానీ ఆ ప్రభావం లేకుండా ఆడియన్స్ బిగ్ స్క్రీన్ లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంటర్టైన్ అవుతున్నాడు ఆడియన్. ఈ కరోన మననుండి వెళ్లిపోయాక తప్పకుండా ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారు.

కరోన ఎఫెక్ట్ ఎలా ఉంది ?

ఈ కరోన ఎఫెక్ట్ అన్ని వర్గాల వారిపై ఉంది. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీస్ లో ఉంటుంది. దీన్ని అందరూ కలిసి బాధ్యతగా తీసుకొని ఫైట్ చెయ్యాలి. ఫైనాన్సిల్ క్రైసిస్ అందరిమీద ఉందని చెప్పగలను.

"పాగల్" సినిమా గురుంచి

మార్చి 19న మంచి రోజు కావున విశ్వక్ సేన్ తో నేను పాగల్ అనే సినిమా మొదలు పెట్టాను, కొత్త దర్శకుడు నరేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ చెయ్యాలని భావించాం, కానీ సడన్ గా ఇలా లాక్ డౌన్ వచ్చింది. లాక్ డౌన్ అవ్వగానే షూటింగ్ మొదలు పెడతాం.

తదుపరి చిత్రాలు...

విశ్వక్ సేన్ తో "పాగల్" చేస్తున్నాం.ఆ తర్వాత హీరో శ్రీవిష్ణు హీరోగా ఒక సినిమా చేయబోతున్నాం, ప్రదీప్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు, మంచి కథ కథనాలతో ఈ సినిమా ఉండబోతోంది. అలాగే అంతా కొత్త వారితో "రోటీ - కపడా - రొమాన్స్" అనే సినిమా ప్లానింగ్ లో ఉంది, మరియు దిల్ రాజు గారితో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ అసోసియేట్ అయ్యి చేస్తున్నాము.

Facebook Comments