కరోనాపై పోరుకి తళపతి విజయ్ రూ. 1.3 కోట్లు విరాళం.
కరోనా వైరస్(కోవిడ్ 19) నిర్మూలనకు కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ తళపతి విజయ్ రూ.1.3 కోట్లు తన వంతుగా కేంద్రం మరియు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు విరాళాన్ని ప్రకటించారు.
ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5లక్షలు అంటే రెండు రాష్ట్రాలకు రూ.10 లక్షల విరాళంతో పాటు ప్రధాన మంత్రి సహాయ నిధి కి రూ. 25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి నిధికి రూ. 50 లక్షలు, కేరళ సహాయ నిధికి రూ. 10 లక్షలు, కర్ణాటక మరియు పుదుచ్చేరి రాష్ట్రాల సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు, ఫెఫ్సి అసోసియేషన్ నిధికి రూ. 25 లక్షలు ప్రకటించారు.
This website uses cookies.