నటుడు శ్రీ ఉత్తేజ్ రక్తదానం
'అన్నమాట బంగారుబాట' అంటూ మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడలను అనుక్షణం ఆరాధనాపూర్వకంగా అనుసరించే నటుడు, కవి శ్రీ ఉత్తేజ్ బుధవారం రక్తదానం చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ఆయన శ్రీమతి పద్మతో కలిసి వచ్చిన ఉత్తేజ్ మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు రక్తదానం చేశారు.
అంతేకాకుండా తన ఆత్మీయ స్నేహితులు ఎనిమిది మంది కూడా బుధవారం నాడు రక్తదానం చేశారు. ఇంకా తన సన్నిహితుల్ని సైతం సంప్రదించి వారు కూడా రక్తదానం చేసేలా ఉత్తేజపరుస్తానంటూ హామీ ఇచ్చారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా శ్రీ చిరంజీవి గారు అసలు సిసలైన హీరో అని కొనియాడారు ఉత్తేజ్.
Facebook Comments