Social News XYZ     

Music Director Koti As Hero A New Police Movie Titled Sugriva

మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి హీరోగా సుగ్రీవ ఒక పోలీస్ కథ.

ఈ కరోనా విపత్కర పరిస్థితులలో డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు అత్యంత శ్లాఘనీయం.

వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఎండలో నిలబడి అనవసర తిరుగుబోతులను నియంత్రించి కరోనా వ్యాప్తిని అరికడుతున్నారు. పారిశుధ్య కార్మికులు వీధులు, పరిసరాలను శుభ్రపరచి కరోనా దుష్ట కణాలను నిర్వీర్యం చేస్తున్నారు.

 

దేశాన్ని రక్షణ వలయంలో ఉంచి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న మనవ రూపంలోని దేవతలు వాళ్లు. వాళ్లే మనకి అల్లా, జీసస్, శివుడు.

ముస్లింలు వారిలో అల్లాని చూడండి. క్రైస్తవులు వారిలో జీసస్'ని చూడండి. హిందువులు వారిలో శివుణ్ణి చూడండి. అని తెలియజేసే సందేశాత్మక అంశంతో ఒక సినిమా రూపు దిద్దుకుంటోంది.

ఎన్నో ప్రతిఘటనలను, మరెన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ, ధైర్య సాహసాలతో, నీతి నిజాయితీలతో తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీస్ ఆఫీసర్'లను స్ఫూర్తిగా తీసుకుని వారి సేవలను వెలుగులోకి తేవడం కోసం ఒక సిన్సియర్, డేరింగ్ & డాషింగ్ పోలీస్ ఆఫీసర్ కథతో మా తదుపరి సినిమాను రూపొందించబోతున్నాను.

ఈ చిత్రంలో మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి పవర్'ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్'ని చేయబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది అని దర్శకులు నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) తెలియజేశారు. ఈ సినిమాకు నిర్మాత ఎం.యన్.ఆర్.చౌదరి.

Facebook Comments