Social News XYZ     

Lets’s Save Farmers: Sai Kumar

రైత‌న్న‌ను కాపాడుకుందాం!- సాయికుమార్

క‌రోనా విధ్వంశం రైతుపైనా తీవ్రంగా ఉంది. పండించిన పంట అమ్ముడుపోని ప‌రిస్థితి. దీనిపై న‌టుడు సాయికుమార్ త‌న‌దైన సందేశం ఇచ్చారు.

సాయికుమార్ మాట్లాడుతూ-జై రైత‌న్న ..రైతు దేశానికి వెన్నె ముక‌. రైతు లేనిదే మ‌నం లేం. క‌రోనా దాడి వేళ రైత‌న్న ఇబ్బందిలో ఉన్నారు. అర‌టి, బ‌త్తాయి, నిమ్మ‌, జామ వీట‌న్నిటినీ కొనుక్కుని తిందాం. రోగ నిరోధ‌క‌త పెంచుకుందాం. రైతును కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం. రైతుకు మ‌నం అవ‌స‌రం. మ‌న‌కు రైతు అవ‌స‌రం. దేశాన్ని కాపాడుకుందాం.. జైహింద్ అంటూ పిలుపునిచ్చారు.

 

Facebook Comments