Corona Crisis Charity Distributed 1000 Kits In One Day

ఒక్క‌రోజే వెయ్యి మంది సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు

క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో సినీకార్మికుల భృతి స‌హాయార్థం క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) నిరంత‌రం ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే వెయ్యి మంది సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు. సీసీసీ స‌రుకుల పంపిణీ చేస్తున్న టీమ్ పై సీసీసీ ర‌ధ‌సార‌థి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-ఒకే రోజు వెయ్యి మందికి స‌రుకులు పంపిణీ చేశాం అంటే ఆశ్చ‌ర్య‌పోయాను. ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ప‌ని చేయాలంటే ప్ర‌తి ఒక్క‌రూ సైనికుల్లా ముందుకొచ్చి ఇదొక బాధ్య‌త‌గా ధ‌ర్మంగా భావించి ఈ ప‌ని చేసారంటే ప‌రిశ్ర‌మ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. డ‌బ్బు ఉన్నా ప‌ని సేవ చేసే వాళ్లు కావాలి. అంద‌రూ అభినందిస్తున్నారు. ప్ర‌శంసిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ గారు ఈ పంపిణీ విధానం తెలుసుకొని నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌- ఎన్.శంక‌ర్ తోపాటు మరీ ముఖ్యంగా మెహ‌ర్ ర‌మేష్ కి నా ప్రత్యేక అభినంద‌న‌లు అని తెలిపారు.

Corona Crisis Charity Distributed 1000 Kits In One Day (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%