Social News XYZ     

Krishnam Raju Wife Shyamala Devi Distributes Payasam To People Working During Lockdown

లాక్ డౌన్ సేవ‌కుల‌కు పాయ‌సం పంపిణీ చేసిన కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామలా దేవి సామాజిక కార్య‌క్ర‌మాల్లో ఎప్పుడూ ముందుంటారు. అవేర్ నేస్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా భ‌ర్త తో క‌లిసి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇక ప‌రిశ్ర‌మ‌లోనూ శ్యామ‌లా దేవి త‌ల‌లో నాలుక లాంటి వారు. చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగే సినిమా వేడుక‌ల‌కు అప్పుడ‌ప్పుడు భ‌ర్త‌తో క‌లిసి హ‌జ‌ర‌వుతుంటారు. ఇటీవ‌లే లాక్ డౌన్ నేప‌థ్యంలో ఆప‌న్న హ‌స్తంలో భాగంగా 4 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. కాగా సోమ‌వారం శ్యామ‌లా దేవి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా శ్యామ‌లాదేవి హైద‌రాబాద్ సిటీలో లాక్ డౌన్ సేవ‌ల్లో పాల్గొంటున్న పారిశుద్ది కార్మికులు, పోలీసు సిబ్బందికి..మీడియా వారికి ఆమె స్వ‌హ‌స్తాల‌తో త‌యారు చేసిన పాయ‌సాన్ని పంపిణీ చేసారు.

ఈ సంద‌ర్భంగా శ్యామ‌లా దేవి మాట్లాడుతూ, ఈ రోజు నా పుట్టిన రోజు సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్ స‌మ‌యంలో సేవ‌లందిస్తున్న పారిశుద్ది కార్మికుల‌కు..పోలీసు వారికి..మీడియా వారికి నా చేతుల‌తో త‌యారు చేసిన పాయ‌సాన్ని పంచాను. అదే నాకు నిజ‌మైన పుట్టిన రోజు. ప్రాణాల‌కు తెగించి..కుటుంబాల‌ను వ‌దిలేసి వీళ్లంతా ప్ర‌జ‌ల కోసం ఎంతో సేవ చేస్తున్నారు. నా వంతుగా ఈ రోజు వాళ్ల‌కి నా చేతుల‌తో త‌య‌రు చేసిన పాయ‌సాన్ని అందించాను అని అన్నారు.

 

Facebook Comments