ఏడు బాషల్లో సెన్సార్ కు రెడీ అయిన 'ఓ మనిషి నీవెవరు'
రిజ్వాన్ కల్ షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఓమనిషి నీవెవరు
. గాడ్ మినీస్ర్టీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ మూర్తి రాజ్ కుమార్ నాయుడు దర్శకత్వంలో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మించారు. ప్రభాకర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఏడు బాషల్లోగ్రాండ్ రిలీజ్ కాబోతుంది. తెలుగు తమిళ్ కన్నడ మలయాళ ఒడిస్సా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తొలి కాపీ సిద్ధమై సెన్సార్ కార్యక్రమాల కోసం రెడీగా వుంది
ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ: కరోనా వైరస్ వల్ల ప్రపంచం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈలాంటి సమయంలోనే అందరూ తగు జాగ్రత్తలు పాటించాలి.ఇక ఈ సినిమాలో నటించడం ఒక అదృష్టంగా భావించి చేసాను. చాలా వైవిథ్యంగా నా పాత్ర ఉంటుంది. ఇలాంటి సినిమాలు నిర్మించాలి అంటే గట్స్ వున్న మా గోపాల కృష్ణ లాంటి నిర్మాతలు మాత్రమే చెయ్యగలరు. నటి నటులందరు ఎంతో కమిట్ మెంట్ తో నటించారు. ఏసు పాత్రకు రిజ్వాన్ బాగా సూటయ్యాడు. ఇటీవల విడుదలయిన పాటల కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా ఆరు భాషల్లోనూ గొప్ప విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది` అని అన్నారు.
చిత్ర దర్శకుడు కృష్ణ మూర్తి రాజ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ, ఏడు బాషల్లో కూడా తొలి కాపీ సిద్ధమై సెన్సార్ కార్యక్రమాలకు రెడీ గా వుంది. మా నిర్మాత గోపాలకృష్ణ గారు నా మీద నమ్మకం తో ఈ సినిమా కు నేను ఎది అడిగినా ఇచ్చి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాతో చాలా మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిచయం అవుతున్నారు. ఇదంతా జీసస్ బ్లస్సింగ్ వల్లే జరిగింది. సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా
అని అన్నారు.
స్ర్కీన్ ప్లే రచయిత, చిత్ర నిర్మాత గోపాలకృష్ణ దొండపాటి మాట్లాడుతూ, `ఏసు ప్రభు ఆశీర్వచనాలు వలన త్వరలోనే కరోనా మహమ్మారి నిర్మూలనకు ఆశిస్తున్నాను. దయమయుడైనా ఏసు ప్రభు గురించి సినిమాని నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పక్కా ప్లానింగ్ తో అందరి కోపరేషన్ తో గ్రాండ్ గా నిర్మించాను. ఇటీవల నటశేఖర కృష్ణ గారు రిలీజ్ చేసిన ఈ సినిమాలోని పాటలు మంచి హిట్ అయ్యాయి సెన్సార్ కార్యక్రమాలకు రెడీ అయిన ఈ సినిమా ను తెలుగు , హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళ, ఒడిశా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసెందుకు ప్లాన్ చేసాము. అని అన్నారు.
పల్లె విష్ణు వర్దన్ రెడ్డి, డింపు ఫణికుమార్, జెన్ని, జూనియర్ రేలంగి, బి.మెచ్.ఇ. యల్ ప్రసాద్, ఆకెళ్ల, సంగీత్ ఆనంద్, మునీశ్వరరావు, జాను, అరుణ తదితరలులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే: గోపాలకృష్ణ దొండపాటి, మాటలు: జి. విజయ, పాటలు: వినయ్ కుమార్, కొరియోగ్రపీ: వేణు మాస్టర్, కళ: సుభాష్, ఎడిటింగ్: వి. నాగిరెడ్డి, ఛాయాగ్రహణం: సూర్య భగవాన్ మోటూరి, చీఫ్- కోడైరెక్టర్: జి. శివ ప్రసాద్ రెడ్డి, సహ నిర్మాత: జంపన దుర్గా భవానీ. నిర్మాత: స్వర్ణ కుమారి దొండపాటి, దర్శకత్వం: కృష్ణ మూర్తి రాజ్ కుమార్ నాయుడు.
This website uses cookies.