Artist Jeevan Feeding Poor During CoronaVirus Lock Down

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నిరుపేద‌ల క‌డుపులు నింపుతున్న ఆర్టిస్ట్ జీవ‌న్

ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి మనిషే సాయం అవుతాడు..కోరలు చాచి న కరోనా మహమ్మారి ధాటికి ఇప్పుడు చాలా మంది ఆకలి బాధలు పడుతున్నారు.. వారికి నిరంతరాయంగా సేవలు చేస్తున్నాడు ఆర్టిస్ట్ జీ వన్.. గత 15 రోజులుగా దాదాపుగా రోజుకు వెయ్యి మందికి కడుపులు నింపుతున్న జీ వన్.. ఇప్పుడు నిత్యావసర సరుకులు రెండు వేల మందికి పంచుతున్నాడు.. తన సంపాదన మొత్తం ఖర్చు అయినా ప‌ర్లేదు కానీ పరులకు చేసే సాయం ఇచ్చే సంతృప్తి కి సాటి రాదు అంటున్నాడు.. అంద‌రికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. లాక్ డౌన్ అయిన మ‌రుస‌టి రోజు నుండీ తమ రెస్టారెంట్ ని క‌రోనా బారిన ప‌డి ఆకలి తో అవ‌స్థ‌లు ప‌డుతున్న వారిని ఆదుకునే సేవా కేంద్రంగా మ‌లిచాడు. అత‌ని ఆలోచ‌న‌కు అత‌ని పార్ట‌న‌ర్ అభిన‌వ్ చోర‌వ‌తో ఈ సాయం చేసే ప‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ నిరంత‌రాయంగా కొన‌సాగుతుంది.

ప్ర‌తి రోజూ వెయ్యి మందికి పైగా స‌రిప‌డే ఆహారం త‌యారు చేసి సైబ‌రాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ అధికారి ప్ర‌వీణ్ రెడ్డి బృందానికి అందిస్తాడు జీవ‌న్ . అక్క‌డి నుండి అవ‌ర‌స‌ర‌మైన వారికి పోలీసులు స‌ర‌ఫ‌రా చేస్తారు. ఒక్కోసారి జీవ‌న్ వారితో పాటు వెళ్ళి ఆహారం ని అందిస్తాడు. బోజ‌నంతో పాటు కూర‌గాయలు కూడా కొన్ని రోజులు సంగారెడ్డి రైతుల ద‌గ్గ‌ర నుండి నేరుగా కొనుగోలు చేసి అందించింది జీవ‌న్ బృందం. ఇప్ప‌డు రెండు వెల మందకి వారం రోజుల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర వ‌స్తువులు స‌ర‌ఫ‌రా చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ స‌హాయ‌క చర్య‌ల‌కు జీవన్ కి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ , న‌టి అన‌సూయ , హారి తేజ నటులు అభిన‌వ్ గోమ‌ఠం మ‌రికొంద‌రు అండ‌గా నిలిచారు.

ఈ సంద‌ర్భంగా జీవ‌న్ మాట్లాడుతూః ఈ లాక్ డౌన్ పిరియ‌డ్ లో ఆక‌లితో క‌ష్ట ప‌డే వారికి సాయం చేద్దామ‌ని ఆలోచ‌న వచ్చిన‌ప్పుడు మా పార్ట‌న‌ర్ అభిన‌వ్ నాకు అండ‌గా నిల‌బ‌డ్డాడు. నేను మొద‌టి నా సేవింగ్స్ నే ఖ‌ర్చు చేసి ఆక‌లితో ఉన్న వారికి ఆహారం అందించాము.. మా ప్ర‌య‌త్నానికి ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ మ‌రియ అత‌ని ఫ్యామిలి అండ‌గా నిలిచారు. ఇప్పుడు గ‌త రెండు వారాలుగా మేము నిరంత‌రాయంగా పుడ్ , కూర‌గాయ‌లు , నిత్యావ‌ర‌స‌ర స‌రుకులు అందిస్తూ వ‌చ్చాము. మాకు స‌హాక‌రించిన పోలీసు అధికారుల‌కు ప్ర‌త్యేక ధ‌న్యావాదాలు. సంపాద‌న కంటే ఎదుటి వారి ఆక‌లి తీర్చ‌డంలో నాకు ఎక్కువ సంతృప్తి క‌లిగింది.. అన్నారు..

త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూః ఇలాంటి ఆప‌ద్కాలంలో పోలీసులు, మెడిక‌ల్ సిబ్బంది, శానిట‌రీ వ‌ర్క‌ర్స్ వాళ్ళ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి స‌మాజం కోసం క‌ష్ట‌ప‌డుత‌న్నారు. వాళ్ళ‌తో పాటు మ‌రికొంత మంది స్వ‌చ్చంధంగా ముందుకు వ‌చ్చి ఆక‌లితో ఉన్న వాళ్ళ‌కు క‌డుపులు నింపుతున్నారు. వాళ్ల‌లో ఒక‌రు జీవ‌న్ ఆయ‌న నా ఫ్రెండ్ అయినందుకు గ‌ర్వ ప‌డుతున్నాను. త‌న రెస్టారెంట్ స్టాఫ్ ని ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మాజం కోసం ప‌నిచేసేలా న‌డిపిస్తున్నాడు. అన్నారు.

అన‌సూయ మాట్లాడుతూః లాక్ డౌన్ జ‌రిగ‌న‌ప్పుడు నుండీ జీవ‌న్ బృందం చాలా బాగా స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఆహారం అందిచ‌డంతో పాటు కూర‌గాయ‌లు , నిత్యావ‌స‌రాలు అందిస్తూ చాలా బాగా స‌మాజం కోసం ప‌నిచేస్తున్నారు. వారికి నా అభినంద‌న‌లు .. వాళ్ళు చేస్తున్న సేవ‌ల‌కు నేను స‌పోర్ట్ గా నిలిచాను. కేవ‌లం మ‌నుషుల‌కే కాకుండా వీధి కుక్క‌ల‌కు జీవ‌న్ బృందం ఆహారం అందిస్తుంది. ఇప్పుడు రెండు వేల మంద‌కి ఒక వారినికి స‌ర‌ప‌డా నిత్యావ‌స‌రాలు అందించేందుకు జీవ‌న్ బృందం రెడీ అయ్యింది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స‌మాజం గురించి ఆలోచిస్తున్న జీవ‌న్ కి స‌పోర్ట్ గా నిల‌వాలి అని అన్నారు.

Artist Jeevan Feeding Poor During CoronaVirus Lock Down (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%