ERRAKOTA IDISANGATHI AP_TPT_09_03
() కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపచేసే సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అన్నారు...మహాకవి శ్రీశ్రీ. మారుతున్న కాలంతో పాటు తాము మారలేక.. సాంకేతికత కారణంగా చేతి వృత్తులు అంతరించిపోతున్న రోజులివి. మగ్గాలు మూలన పడేసి, కొలిమిలోని నిప్పులు ఆర్పేసి, చక్రాన్ని అటకెక్కిస్తున్న పరిస్థితులివి. పొట్టకూటి కోసం పట్నం బాట పడుతున్నారు చేతివృత్తులను నమ్ముకున్న వాళ్లు. కానీ ఒక్కచోట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ కుమ్మరి చక్రం గిర్రున తిరుగుతోంది, కార్మికుడి మోముపై చిరునవ్వు కనిపిస్తుంది. లోకం పోకడ గుర్తెరిగిన ఆ చేతి పనివారు సమాజ పోకడలను తమ వృత్తికి అన్వయింపజేస్తున్నారు. చేతినిండా సంపాదిస్తూ... తమకుతామే సాటని నిరూపిస్తున్నారు. శరీరకకష్టం, నైపుణ్యంతోనే కాకుండా మేధాసంపత్తిని తమ వృత్తికి కలగలిపి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఈ కళాకారులు. Look
TERRA-PROFITS IDISANGATHI AP_TPT_09_03
() వంటింట్లో ఉపయోగించే మట్టి పాత్రలు. కనువిందు చేసే అందమైన ప్రతిమలు. పెరట్లో మొక్కలు పెంచే పూల కుండీలు. దేవుడి గదిలో పూజలందుకొనే విగ్రహాలు. ఇలా విభిన్న అవసరాలకు కళాత్మక వస్తువులు అద్భుతంగా తీర్చిదిద్దుతారు ఈ కళాకారులు. ప్రాచీన కళలో ప్రావీణ్యం సంపాదించి తమలో దాగిన నైపుణ్యాలను చాటడమే కాదు... ఆరంకెల మొత్తంలో ఆదాయాన్ని అర్జిస్తున్నారు. సాంకేతికత పూర్తి స్థాయిలో వినియోగించుకుని అద్భుత విజయాలు అందుకుంటున్నారు. గతంలో చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమైన కళను ప్రపంచ దశదిశలా వ్యాపింపజేస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన మట్టి బొమ్మల తయారీతో ఉపాధి పొందడమే కాకుండా.. ప్రాచీన కులవృత్తిని ఆధునిక యుగంలోనూ వెలుగులీనేలా చేస్తున్నారు.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
ERRAKOTA IDISANGATHI AP_TPT_09_03 () కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపచేసే సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అన్నారు...మహాకవి శ్రీశ్రీ. మారుతున్న కాలంతో పాటు తాము మారలేక.. సాంకేతికత కారణంగా చేతి వృత్తులు అంతరించిపోతున్న రోజులివి. మగ్గాలు మూలన పడేసి, కొలిమిలోని నిప్పులు ఆర్పేసి, చక్రాన్ని అటకెక్కిస్తున్న పరిస్థితులివి. పొట్టకూటి కోసం పట్నం బాట పడుతున్నారు చేతివృత్తులను నమ్ముకున్న వాళ్లు. కానీ ఒక్కచోట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ కుమ్మరి చక్రం గిర్రున తిరుగుతోంది, కార్మికుడి మోముపై చిరునవ్వు కనిపిస్తుంది. లోకం పోకడ గుర్తెరిగిన ఆ చేతి పనివారు సమాజ పోకడలను తమ వృత్తికి అన్వయింపజేస్తున్నారు. చేతినిండా సంపాదిస్తూ... తమకుతామే సాటని నిరూపిస్తున్నారు. శరీరకకష్టం, నైపుణ్యంతోనే కాకుండా మేధాసంపత్తిని తమ వృత్తికి కలగలిపి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఈ కళాకారులు. Look TERRA-PROFITS IDISANGATHI AP_TPT_09_03 () వంటింట్లో ఉపయోగించే మట్టి పాత్రలు. కనువిందు చేసే అందమైన ప్రతిమలు. పెరట్లో మొక్కలు పెంచే పూల కుండీలు. దేవుడి గదిలో పూజలందుకొనే విగ్రహాలు. ఇలా విభిన్న అవసరాలకు కళాత్మక వస్తువులు అద్భుతంగా తీర్చిదిద్దుతారు ఈ కళాకారులు. ప్రాచీన కళలో ప్రావీణ్యం సంపాదించి తమలో దాగిన నైపుణ్యాలను చాటడమే కాదు... ఆరంకెల మొత్తంలో ఆదాయాన్ని అర్జిస్తున్నారు. సాంకేతికత పూర్తి స్థాయిలో వినియోగించుకుని అద్భుత విజయాలు అందుకుంటున్నారు. గతంలో చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమైన కళను ప్రపంచ దశదిశలా వ్యాపింపజేస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన మట్టి బొమ్మల తయారీతో ఉపాధి పొందడమే కాకుండా.. ప్రాచీన కులవృత్తిని ఆధునిక యుగంలోనూ వెలుగులీనేలా చేస్తున్నారు.
This website uses cookies.