ప్రముఖులు విడుదల చేసిన ‘పసివాడి ప్రాణం’ లిరికల్ ఆడియో సాంగ్స్
అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘పసివాడి ప్రాణం’. ధన్‌శ్రీ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎన్.ఎస్. మూర్తి దర్శకుడు. టాలీవుడ్‌లో ఇంత వరకూ రానటువంటి వినూత్నమైన ‘లైవ్ కం యానిమేషన్’ టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర లిరికల్ ఆడియో సాంగ్స్‌ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్, ప్రముఖ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, అలాగే సక్సెస్‌పుల్ చిత్రాల నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఎన్. ఎస్. మూర్తి మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్రంలోని లిరికల్ ఆడియో సాంగ్స్‌ని విడుదల చేసిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డిగారికి, వి.వి. వినాయక్‌గారికి అలాగే రాజ్ కందుకూరిగారికి చిత్రయూనిట్ తరుపున ధన్యవాదాలు. చిత్ర విషయానికి వస్తే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రానటువంటి వినూత్నమైన లైవ్ కం యానిమేషన్ చిత్రం ‘పసివాడి ప్రాణం’. మోషన్ కాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్ టెక్నాలజీలతో నిర్మితమైన 3డి మరియు 2డి క్యారెక్టర్ మిగిలిన నటీనటులతో పోటీగా ప్రేక్షకులను మెప్పించడం ఈ సినిమాకున్న ప్రత్యేకత. అలాగే 2డి బేబీ మరియు 3డి టెడ్డీ బేర్ ఈ సినిమాలో అందరినీ ఆకర్షిస్తాయి. 90లలో మెగాస్టార్ చిరంజీవిగారు నటించిన సూపర్ హిట్ సినిమా పేరు, మా సినిమా పేరు ఒక్కటే కావడం యాదృచ్చికం. ఇంకో విషయం ఏమిటంటే ఆ సినిమాలో పసివాడిగా నటించి, మెప్పించిన ఈనాటి బుల్లితెర వదినమ్మ ఫేం ‘సుజిత’గారు ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి కథ ప్రాణమైతే ఊపిరి సీజీ వర్క్. మోషన్ కాప్చర్, 2డి మరియు 3డి, గ్రాఫిక్స్ విశాఖపట్నం Imagicans సంస్థ చేసింది. మేకప్ స్పెషలిస్ట్‌లు విజయ్, సుమన్, Imagicans శేషగిరిగారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది..’’ అని తెలిపారు.
అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి, యోగి, రుబినా, ఎఫ్.ఎమ్ బాబాయ్ తదితరులు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి కెమెరా: కె. బుజ్జి, సంగీతం: జి.జె. కార్తికేయన్, కొరియోగ్రఫీ: చార్లీ, ఫైట్స్: కుంగ్ ఫూ శేఖర్, స్టోరీ-స్ర్కీన్‌ప్లే-డైరెక్షన్: ఎన్.ఎస్. మూర్తి.