Naakidhe First Time Movie Audio And Trailer Launched

‘‘నాకిదే ఫస్ట్‌టైమ్‌’ ఆడియో అండ్‌ ట్రైలర్ లాంచ్‌!!

శ్రీ వల్లిక ఫిలింస్‌ పతాకంపై ధనుష్‌బాబు, సింధూర, కావ్యకీర్తి, హీరో హీరోయిన్లుగా రాంరెడ్డి ముస్కు దర్శకత్వంలో కురుపా విజయ్‌ కుమార్‌ ముదిరాజ్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘నాకిదే ఫస్ట్‌టైమ్‌’. ఈ చిత్రం ఆడియో మరియు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది.

ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం మినిస్టర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ..‘‘నాకిదే ఫస్ట్‌టైమ్‌’ ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఫస్ట్ టైమ్‌ సినిమా చేస్తోన్న దర్శక నిర్మాతలకు ఇతర యూనిట్‌ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు ’’
అన్నారు.

ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆడియో , ట్రైలర్ లాంచ్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ అధికారిక ప్రతినిధి వేణుగోపాల చారి మాట్లాడుతూ..‘‘నాకిదే ఫస్ట్‌టైమ్‌’ టైటిల్‌తో పాటు ట్రైలర్ యూత్‌కి కనెక్టయ్యే విధంగా ఉంది. ఫస్ట్‌టైమ్‌ సినిమా నిర్మిస్తోన్న విజయ్‌కు ఈ సినిమా మంచి పేరు, లాభాలు తీసుకరావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

సాయి వెంకట్‌ మాట్లాడుతూ...‘‘ఈ చిత్ర కథ,కథనాలు నాకు తెలుసు. దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా తీశారు. ట్రైలర్ చాలా ట్రెండీగా టీనేజ్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ...‘‘విజయ్‌ కుమార్‌ గారు ఈ సినిమా నిర్మిస్తూ మంచి పాత్రలో నటించారు. ట్రైలర్ చూశాక యూత్‌కి నచ్చే అంశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది . సినిమా సక్సెస్‌ సాధించి ఫస్ట్‌టైమ్‌ చేస్తోన్న టీమ్‌ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు.

హీరో ధనుష్‌ బాబు మాట్లాడుతూ..‘‘టైటిల్‌లాగే నాక్కూడా ఇదే ఫస్ట్‌ సినిమా. దర్శక నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమా చేశా’’ అన్నారు.

దర్శకుడు రాంరెడ్డి మాట్లాడుతూ..‘‘నాకిదే ఫస్ట్‌టైమ్‌’ టైటిల్‌ క్యాచీగా ఉందంటూ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మనం ఎన్నో సందర్భాలలో నాకిదే ఫస్ట్ టైం అంటుంటాం. కథకు పర్ఫెక్ట్‌గా సరిపోయే టైటిల్‌ ఇది. మంచైనా, చెడైనా దాన్ని బేలన్స్ చేసుకుంటూ ముందుకెళితేనే జీవితం సంతోషంగా ఉంటుంది తప్ప తొందరపాటు నిర్ణయాతో లైఫ్‌ని రిస్క్‌ల్లో పడేసుకోవద్దు అనేది మా చిత్రంలో చూపిస్తున్నాం. ఇందులో లవ్‌, రొమాన్స్‌, ఎమోషన్‌, కామెడీ ఇలా అన్ని రకాల ఆడియన్స్‌కు నచ్చే అంశాలుంటాయి’’ అన్నారు.

నిర్మాత విజయ్‌కుమార్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ...‘‘నేను కూడా గతంలో మీడియా రంగంలో కొంతకాలం ఉన్నాను. అలాగే పలు సినిమాలు , సీరియల్స్‌లో నటించాను. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో బిజీగా ఉన్నా. ఈ క్రమంలో దర్శకుడు రాంరెడ్డి ఏడాది పాటు వెంటపడి ఈ సినిమా తీయించాడు. ఆయన సిన్సియారిటీ నచ్చి సినిమా తీయడానికి ముందుకొచ్చా. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ధనుష్‌ బాబు అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాం. ఇతడు మంచి క్రికెటర్‌. మా కథకు సరిపోతాడని హీరోగా తీసుకున్నాం’’ అన్నారు.

ఆదిత్య, విజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌, జ్యోతి, అగస్టిన్‌ చెరుకూరి, విజయ భాస్కర్‌, శర్మ, బాబురావు, సోఫియా తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ అక్కల ;సంగీతం: విజయ్‌ కురాకుల ;ఎడిటింగ్‌: నందమూరి హరి; ఫైట్స్‌: వజ్రాలు; కొరియోగ్రఫీ: జాక్‌ సూర్యకిరణ్‌; పీఆర్వో: చందు రమేష్‌ (బాక్సాఫీస్‌) నిర్మాత: కురుపాల విజయ్‌ కుమార్‌ ముదిరాజ్‌; దర్శకత్వ: రాంరెడ్డి ముస్కు.

Facebook Comments
Share
%%footer%%