సినిమా: చీమ ప్రేమ మధ్యలో భామ
నటీనటులు : అమిత్, ఇందు
దర్శకత్వం : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు
నిర్మాతలు : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ
సంగీతం : రవి వర్మ
సినిమాటోగ్రఫర్ : ఆరిఫ్ లలాని
ఎడిటర్ : హరి శంకర్
శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు దర్శకత్వంలో అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ”. సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ,రమ్య చౌదరి తదితరులు నటించిన ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
శివుని వరం చేత ఓ చీమ ధీర(అమిత్) అనే ఓ యువకునిగా మారుతుంది. ధీరకు కాలేజీలో మీరా(ఇందు)తో పరిచయం ఏర్పడుతుంది. కొద్దిరోజుల తరువాత వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. మరి మనిషి అవతారంలో ఉన్న చీమ ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమాలో హీరోగా పరిచయమైన అమిత్ అందంగా కనిపిస్తూ ఎలాంటి తడబాటు, బెఱుకు లేకుండా నటించాడు. ముందుముందు సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉన్నట్లు కనపడుతుంది.
ఇక హీరోయిన్ ఇందు తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.
దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు తొలి ప్రయత్నంలోనే ప్రత్యేక దర్శకత్వ శైలితో ఒక క్లాసిక్ సినిమా తీయడంలో విజయం సాధించారు. చాలా కాలం తరువాత డెప్త్ ఉన్న మంచి డైలాగ్స్ హృదయానికి హత్తుకునెలా ఉన్నాయి. సున్నితమైన ప్రేమను కొత్తగా చిత్రీకరించారు.
కెమెరామెన్ పనితనం బాగుంది. రవి వర్మ అందించిన అన్ని పాటలు అందరూ మెచ్చేలా ఉన్నాయి. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది.
హరి శంకర్ ఎడిటింగ్ దర్శకుడి అభిరుచికి అనుగుణంగా ఉంది. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ముగింపు అద్బుతంగా ఉన్నపటికీ, తొలి భాగంలో సినిమా స్లో గా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ క్వాలిటీ పెంచగలిగి ఉంటే బాగుండేది.
మొత్తంగా చెప్పాలంటే చీమ ప్రేమ మధ్యలో భామ ఒక ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా.
రేటింగ్: 3/5