Pressure Cooker Review: A good entertainer (Rating: ***)

సినిమా: ప్రెషర్ కుక్కర్
నటీనటులు: సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ..
నిర్మాత: సుజోయ్ – సుశీల్ – అప్పి రెడ్డి
దర్శకత్వం: సుజోయ్ – సుశీల్
సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్ – అనిత్ మాదాడి
మ్యూజిక్: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరన్, హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్‌: నరేష్ రెడ్డి జొన్న
రన్ టైం: 2 గంటల 14 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020
రేటింగ్: 3/5

ఈ మధ్య తల్లి తండ్రుల ఆశలన్నీ అమెరికా వైపే ఉంటున్నాయి, చాలా మంది అమెరికా చూపించే పిల్లల్ని పెంచుతున్నారు. దాదాపు ఎక్కువమంది జరిగే ఇళ్లలో జరిగే ఇదే ఇతి వృత్తాన్ని కథగా తీసుకొని యంగ్ డైరెక్టర్స్ సుజోయ్ – సుశీల్ అండ్ టీం కలిసి చేసిన ప్రయత్నమే ‘ప్రెషర్ కుక్కర్’. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ ని మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

నరసింహా రావు తన కుమారుడు కిషోర్(సాయి రోనక్) లక్ష్యం అమెరికా వెళ్లడమే అని చిన్నప్పటి నుంచీ చెప్పి పెంచుతాడు. గ్రాడ్యువేషన్ తర్వాత యుఎస్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్ చెయ్యాలనుకున్న కిషోర్ కి వీసా రిజెక్ట్ అవుతుంది. ఎలాగైనా తండ్రి కోరిక తీర్చాలని హైదరాబాద్ కి వచ్చి వీసా కోసం పలు ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దాంతో హైదరాబాద్ లోనే ఒక జాబ్ లో చేరతాడు, అదే టైంలో అనిత(ప్రీతి అస్రాని)తో ప్రేమలో పడతాడు. కానీ తన వర్క్ వల్ల ఫైనల్ గా కిషోర్ కి అమెరికా వీసా వస్తుంది. ఆ టైంలో తన ప్రేమని వదులుకొని, తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసం యుఎస్ వెళ్లాడా? లేదా? అటు ప్రేమ – ఇటు తండ్రి కోరిక మధ్య కిషోర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అనేదే ఈ ప్రతి ఇంట్ల ఇదే లొల్లి అనే టాగ్ లైన్ తో వచ్చిన ప్రెషర్ కుక్కర్ కథ.

విశ్లేషణ:

తెరపై ది బెస్ట్ అనిపించుకుంది హీరో రోనక్ హీరోయిన్ ప్రీతి అస్రాని.. ‘మళ్ళీ రావా’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించిన ప్రీతి ఇందులో చేసిన అనిత పాత్రకి పూర్తి న్యాయం చేసింది. లవ్ సీన్స్ లో తన హావ భావాలు సింప్లీ సూపర్బ్. సినిమాలో తన ఒక్క పాత్ర డిజైనింగ్ మాత్రమే పర్ఫెక్ట్ గా ఉంది. సాయి రోనక్ ఎటు డెసిషన్ తీసుకోవాలో తెలియక ఫుల్ ప్రెషర్ లో ఉండే పాత్రలో బాగా చేసాడు. సీనియర్ నటీనటుల్లో తనికెళ్ళ భరణి నటన కథలోని కీ పాయింట్ ని ఎలివేట్ చేయడానికి బాగా హెల్ప్ అయ్యింది. సివిల్ నరసింహారావు నటన కూడా ఉన్నంతలో బాగుంది. హీరో ఫ్రెండ్స్ అండ్ కామెడీ కోసం పెట్టిన రాహుల్ రామకృష్ణ – రాజై రోవన్ పాత్రలు కామెడీని పండించాయి. మిగిలిన పాత్రలు ఉన్నంతలో బెస్ట్ అనిపిస్తాయి.

నగేష్ బానెల్ – అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ లో తన విజువల్స్ మంచి ఫీల్ ని కలిగిస్తాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం బాగుంది. అలాగే సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరన్ అందించిన సాంగ్స్ కూడా బాగున్నాయి. నరేష్ రెడ్డి జొన్న ఎడిటింగ్ పార్ట్స్ పార్ట్స్ గా బాగుంది.

ఇక యంగ్ టాలెంట్ అయిన సుజోయ్ – సుశీల్ విషయానికి వస్తే..వీళ్ళు యుఎస్ రిటర్న్ కావడం వలన వీరి జీవితంలోని అనుభవాలనే స్టోరీ పాయింట్ గా ఎంచుకున్నారు. ఈ పాయింట్ ని ఎవరు ముందు రాశారు అనే పాయింట్ ని పక్కన పెడితే, మంచి కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. వీరు రాసుకున్న స్క్రిప్ట్ ముఖ్యంగా హీరో పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది, అలాగే పాత్రల్లో వచ్చే మార్పుకు సంబందించిన సీన్స్ బలంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే ఎక్కడా బోర్ లేకుండా స్పీడ్ అండ్ షార్ప్ గా ఉండేలా బాగా రాసుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రీతి అస్రాని పెర్ఫార్మన్స్, సెకండాఫ్ లోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

‘ప్రెషర్ కుక్కర్’ – ప్రతి ఇంట్ల ఇదే లొల్లి అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్ లో చూసే వారికి మంచి వినోదాన్ని అందిస్తుంది. చాలా మంది యువత కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది, యూత్ ఆధ్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉండడం బిగ్ అసెట్. స్మాల్ బడ్జెట్ తో రూపొందిన ‘ప్రెషర్ కుక్కర్’ ట్రైలర్ తో ఆకట్టుకుంది, అలాగే సినిమాగా కూడా ఆకట్టుకుంటుంది.

చివరిగా: ‘ప్రెషర్ కుక్కర్’ గుడ్ ఎంటర్టైనర్

Facebook Comments
Summary
Review Date
Reviewed Item
Pressure Cooker
Author Rating
3
Title
Pressure Cooker
Description
ఈ మధ్య తల్లి తండ్రుల ఆశలన్నీ అమెరికా వైపే ఉంటున్నాయి, చాలా మంది అమెరికా చూపించే పిల్లల్ని పెంచుతున్నారు. దాదాపు ఎక్కువమంది జరిగే ఇళ్లలో జరిగే ఇదే ఇతి వృత్తాన్ని కథగా తీసుకొని యంగ్ డైరెక్టర్స్ సుజోయ్ – సుశీల్ అండ్ టీం కలిసి చేసిన ప్రయత్నమే ‘ప్రెషర్ కుక్కర్’. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ ని మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..
Upload Date
February 21, 2020
Share

This website uses cookies.

%%footer%%